Bholaa Shankar 200 మంది డ్యాన్సర్స్‌తో మెగాస్టార్ స్టెప్పులు.. షూటింగ్‌కు వచ్చిన మరో స్టార్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి కలెక్షన్స్ అందుకుంది. అయితే నెక్స్ట్ మెగాస్టార్ నుంచి మరిన్ని డిఫరెంట్ మాస్ కమర్షియల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ కూడా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని మెగాస్టార్ చాలా ధీమాగా కనిపిస్తున్నాడు.

మెహర్ రమేష్ కూడా చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో అతను సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తుతం ఒక సాంగ్ షూట్ అయితే హైదరాబాద్ లోని గచ్చిబౌలి జరుగుతొంది. హైదరాబాదులో వేసిన ప్రత్యేకమైన భారీ కోల్ కత సెట్ లో ఆ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.

Megastar chiranjeevi bhola shankar biggest song and chiranjeevi steps with 200 dancers

ఇక ఈ ప్రత్యేకమైన షూట్ చూసేందుకు మరొక స్టార్ హీరో వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అని తెలుస్తోంది. తండ్రి డ్యాన్స్ ను లైవ్ లోకేషన్ లో చూసేందుకి చరణ్ సెట్ కు వెళ్లినట్లు సమాచారం. దాదాపు 200 మంది డ్యాన్సర్ తో పోటీ పడుతూ మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు వేయబోతున్నారు. ఈ సాంగ్ సినిమా మొత్తంలో కూడా చాలా హైలెట్ గా నిలవబోతోందట. ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రజెంట్ చేసేందుకు మెహర్ రమేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ పాట మాత్రం విజిల్స్ వేయించేలా ఉండబోతుందట.

ఈ సినిమాకు.మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిమిస్తున్నాడు. ఇక ఆ మాస్ పాటకు కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ మెగాస్టార్ తో స్టెప్పులు వేయిస్తున్నారు. ఇదివరకే మెగాస్టార్ తో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న శేఖర్ మాస్టర్ ఈసారి మళ్లీ 200 మంది డాన్సర్స్ తో మెగాస్టార్ ను ఎలా హైలెట్ చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X