Bhola Mania: భోళా మేనియా మొదలు..మాస్ స్టెప్పులతో మెగాస్టార్ ఎనర్జిటిక్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కలిసి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ కుమార్ వేదాళం అనే సినిమాని తెలుగువారి అభిరుచికి తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.
త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ మ్యూజికల్ జర్నీని బ్లాక్ బస్టర్ నోట్‌తో ప్రారంభించారు. తాజాగా విడుదలైన మొదటి పాట భోళా మానియా మాస్ ని ఆకట్టుకునే బీట్‌లతో హైలీ ఎనర్జిటిక్ నెంబర్ గా తీర్చి దిద్దారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను మహతి స్వర సాగర్ ఆకట్టుకునేలా మ్యూజిక్ ఇచ్చారు. రేవంత్ ఎల్వీ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించగా మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ అయితే కన్నుల పండుగలా వున్నాయి.

సుస్మిత కొణిదెల స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన ఈ పాటలో చిరంజీవి స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించడానికి స్కోప్ దొరికింది. ఇక ఈ సాంగ్ అయితే కేవలం మెగా అభిమానులను మాత్రమే కాదు సాహిత్య అభిమానులు అందరినీ ఆకట్టుకునే విధంగా సాగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్లో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు ఎమోషన్స్ తో కలిసిన అన్ని అంశాలు సమపాళ్లలో ఉండబోతున్నాయి. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











