twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather: మెగాస్టార్ మాస్ విశ్వరూపం.. థమన్ ఇచ్చిన మరో సాంగ్ మామూలుగా లేదు!

    |

    మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన సినిమా గాడ్ ఫాదర్ ఇప్పుడు రోజురోజుకు ప్రేక్షకులు అంచనాల స్థాయిని పెంచుతుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే సంకేతాలు అందాయి అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా వైరల్ గా మారుతొంది.

    ఇదివరకే విడుదల చేసిన టీజర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక మొదటి సాంగ్ కూడా మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు థమన్ కంపోజ్ చేసిన మరొక పాట కూడా మాస్ ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చేలా ఉంది అని చెప్పవచ్చు. 'నజబజజజర' అనే ఈ సాంగ్ లో మెగాస్టార్ మాస్ విశ్వరూపం కనిపించింది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

    Megastar chiranjeevi godfather movie latest new mass action song released

    ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి అని ఇదివరకే మెగాస్టార్ వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ పాటలో అది చాలా క్లారిటీగా అర్థమయింది. ఒకవైపు తమన్ మాస్ కంపోజిషన్ మరొకవైపు మెగాస్టార్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ హై రేంజ్ లోనే ఉన్నాయి. తప్పకుండా సినిమాలో ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సన్నివేశాలను చూస్తే మాత్రం ఫ్యాన్స్ విజిల్ వేయడం ఖాయమని అనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మొదట కొంత ట్రోలింగ్ అయితే నడిచింది కానీ ఈ సినిమాకు అతను చాలా హార్డ్ వర్క్ చేసినట్లు మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు.

    ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ విడుదల చేసిన తర్వాత అతని టాలెంట్ ఏమిటో అర్థమవుతుంది అని అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా ఫైనల్ గా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో మలయాళం లో కూడా విడుదల చేస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ కూడా ఎంతో నమ్మకంతో ఉంది. మరి సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Megastar chiranjeevi godfather movie latest new mass action song released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X