Waltair Veerayya: బాస్ పార్టీ రెడీ.. వారి పనితనంపై మెగాస్టార్ స్పెషల్ రియాక్షన్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా మెగా అభిమానులను సరికొత్తగా కట్టుకుంటుంది అని అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచేశాయి. అయితే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మొదటి పాట విడుదలకు సిద్ధమయింది.
బాస్ పార్టీ అంటూ ఈరోజు విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక బుధవారం రోజు బాస్ పార్టీ ఫుల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బాస్ పార్టీ సాంగ్ రేపు విడుదలవుతున్న సందర్భంగా మెగాస్టార్ ఈ విధంగా స్పందించారు. శేఖర్ విజయ్ కొరియోగ్రఫీ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఫూట్ టాపింగ్, ఆర్థూర్ విల్సన్ అద్భుతమైన సినిమాతోగ్రఫీ కూడా ఆకట్టుకుంటాయి.
అలాగే ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది దర్శకుడు బాబి ఆలోచనలకి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ చేసిన ప్రొడక్షన్ డిజైన్ గురించి. తన అనుభవాన్ని రంగరించి ఈ చిత్రానికి మరింత ప్రత్యేకించి పాటకి తాను చేసిన సెట్ ఆర్ట్ వర్క్ మమ్మల్ని అందరినీ ఆకట్టుకుంది. మీ ప్రశంసలను కూడా అతనికి దక్కుతాయని ఆశిస్తూ బాస్ పార్టీ రేపు ప్రారంభం కాబోతోంది అని మెగాస్టార్ వివరణ ఇచ్చారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఊర్వశి రౌతేలా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. మరి సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











