ఆచార్య ఎఫెక్ట్.. అలాంటి పొరపాటు జరగకుండా మెగాస్టార్ మాస్టర్ ప్లాన్?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. కానీ ఆచార్య సినిమాతో ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఆ సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ అందకపోవడంతో బాక్సాఫీస్ పండితులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న కొరటాల శివ ఆ సినిమాకు దర్శకత్వం వహించడమే ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా నిలవాలి. అందులోనూ రామ్ చరణ్ మరొక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుండటం మరొక హైలెట్ పాయింట్. కానీ అవి కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా ఆచార్య సినిమా దాదాపుగా 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నష్టపోయిన వారిని నిర్మాతలు ఆదుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు చిరంజీవి కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు అండగా నిలబడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తదుపరి సినిమా విషయంలో మాత్రం ఇలాంటి పొరపాటు జరగకుండా మెగాస్టార్ చిరంజీవి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Megastar chiranjeevi serious discussion on upcoming movie release promotions

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం. సినిమా విడుదలకు ముందు హైప్ కూడా లేకపోవడం పెద్ద మైనస్. ముఖ్యంగా మణిశర్మ అందించిన పాటలు కూడా థియేటర్స్ కు ప్రేక్షకులను పెద్దగా రప్పించలేకపోయాయి. అయితే మెగాస్టార్ తన తదుపరి సినిమాల విషయంలో మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా ముందుగానే మ్యూజిక్ తో సినిమాకు మంచి గుర్తింపు అందించాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ను రిలీక్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు

గాడ్ ఫాదర్ సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ముందుగానే సినిమాకు సంబంధించిన పాటలతో హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. జూన్ నెలలో సినిమాకు సంబంధించిన మొదటి పాట విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సాంగ్స్ సక్సెస్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు. ఆచార్య విషయంలో జరిగిన పొరపాటు గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని మెగాస్టార్ చిరంజీవి చాలా పట్టుదలతో ఉన్నారు.

అయితే ఇటీవల కాలంలో సంగీత దర్శకుడు తమన్ ఎలాంటి ట్యూన్స్ అందించినా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అతను ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మెగాస్టార్ కు మంచి మ్యూజిక్ ఇస్తాడు అని చెప్పవచ్చు. మెగాస్టార్ తో తమన్ కు ఇది తొలి సినిమా కావడంతో పక్క ఆడియన్స్ ను ఆకట్టుకునే సాంగ్స్ ఉంటాయి అని అనిపిస్తుంది. ఈ సినిమా ఆగస్టులో విడుదల చేస్తారా లేదా అనే విషయంలో చిత్రయూనిట్ ఇంతవరకు అఫీషియల్ లుగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సినిమా ఆగస్టులోనే వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X