Waltair Veerayya నుంచి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్.. మంచులో శ్రీదేవి, చిరంజీవి అంటూ..
Music/instant/oమెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ కమర్షియల్ దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఇటీవల సినిమాలోని పాటలకు సంబంధించిన షూటింగ్ కూడా ఫినిష్ అయింది.
ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. గ్యాప్ లేకుండా గత రెండు వారాలు అనేక రకాల అప్డేట్స్ తో అంచనాలను పెంచేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం శ్రీదేవి చిరంజీవి పాట గురించి అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ ప్రోమో మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు ఫుల్ సాంగ్ మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ ఇద్దరు కూడా రొమాంటిక్ కపుల్స్ గా మంచు ప్రదేశాల్లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది అని ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ పాటను దేవిశ్రీప్రసాద్ రచించి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సాంగ్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ పాట కూడా మరింత అంచనాలను పెంచేసింది. ఈ సంక్రాంతికి రాబోతున్న వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు ఇది ఫుల్ మీల్స్ లా ఉంటుంది అని అర్థమవుతుంది.
ఇక వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవికి, రవితేజకు మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా హైలెట్ అవుతాయట. 2023 జనవరి 13వ తేదీన సంక్రాంతికి విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇక పోటీగా మరో వైపు నుంచి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











