twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరణించిన మైఖేల్ జాక్సన్ సంపాదన చూస్తే షాకే.. రికార్డుస్థాయిలో ఆదాయం!

    By Rajababu
    |

    Recommended Video

    Michael Jackson Makes A History In Youtube

    పాప్ ఇండస్ట్రీలో ఎన్ని సంచలన కెరటాలు వచ్చినా మైఖేల్ జాక్సన్ మించి క్రేజ్ సంపాదించుకొన్న వారు లేరంటే అతిశయోక్తి కాదు. మైఖేల్ భౌతికంగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియా పుణ్యామా అని ఆయన జీవితం ఇంకా మనతోనే సాగుతున్నది. మైఖేల్ జాక్సన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. ఆయన మరణించక ముందు కంటే చనిపోయిన తర్వాత ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగిందట. యూట్యూబ్, తదితర మాధ్యమాలలో ఆయన క్రేజ్ ఇప్పటికీ ఆకాశమంత ఉందట. కళ్లు చెదిరేలా ఉన్న మైఖేల్ సంపాదన గురించి తెలుసుకొందాం.

    100 కోట్ల వ్యూస్

    100 కోట్ల వ్యూస్

    2018లో మైఖేల్ జాక్సన్ వీడియోలకు సోషల్ మీడియా, యూట్యూబ్ మాధ్యమాలలో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. బతికి ఉన్న పాప్ స్టార్ల ఆల్బమ్స్ కూడా ఈ రేంజ్‌లో వ్యూస్ రాకపోవడం గమనార్హం.

    528 కోట్ల ఆదాయం

    528 కోట్ల ఆదాయం

    2017లో మైఖేల్ జాక్సన్‌ డ్యాన్స్, ఇతర పాప్ ఆల్బమ్ వీడియోల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ. 528 కోట్లు వచ్చాయని ఫోర్బ్స్ వెల్లడించింది. మరణాంతరం అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీ ఆయనే అని పేర్కొన్నది. చనిపోయిన తర్వాతనే పాప్ వీరుడు ఎక్కువగా సంపాదిస్తున్నట్టు తన నివేదికలో తెలిపింది.

    గతేడాది 5 వేల కోట్లు

    గతేడాది 5 వేల కోట్లు

    2016 సంవత్సరంలో మైఖేల్ జాక్సన్ ఆదాయం ద్వారా రికార్డు సృష్టించాడు. సోనీ, ఏటీవీ సంస్థలకు తన ఆల్బమ్స్, ఇతర వీడియోలను అమ్మడం ద్వారా 5 వేల కోట్లకుపైనే ఆదాయం లభించింది. ఈ మొత్తం ప్రపంచంలోని బతికి ఉన్న, చనిపోయిన పాప్ స్టార్ల ఆదాయం కంటే అత్యధికం అని వెల్లడించారు.

    2 లక్షల కోట్లు పన్ను

    2 లక్షల కోట్లు పన్ను

    మైఖేల్ జాక్సన్ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని ఫోర్బ్స్ వెల్లడించింది. తన జీవితం కాలంలో అంటే ఇప్పటి వరకు (చనిపోయిన తర్వాత కూడా) మొత్తం 2 లక్షల కోట్లకుపైగా ముందస్తు పన్ను కట్టినట్టు పేర్కొన్నది. అమెరికా ఆదాయపు పన్ను చరిత్రలోనే రికార్డుగా చెప్పుకొంటారు.

    ముగ్గురు కుమారులకు ఆదాయం

    ముగ్గురు కుమారులకు ఆదాయం

    మైఖేల్ జాక్సన్ ఆల్బమ్స్ అమ్మకాలు, రాయల్టీ, యూట్యూబ్‌లో వ్యూస్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆయన ముగ్గురు కుమారులకు లబ్ది చేకూరుతున్నది. పారిస్ (20), ప్రిన్స్ (21), బ్లాంకెట్ (16) అనే ముగ్గురు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.

     మైఖేల్ జాక్సన్ 2009లో మృతి

    మైఖేల్ జాక్సన్ 2009లో మృతి

    ప్రపంచాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ 2009లో మరణించాడు. మితీమిరిన ఔషదాలు తీసుకోవడం వల్లనే ఆయన మృత్యువాత పడ్డారని పోస్ట్ మార్టమ్ రిపోర్టులో తేలింది. ఆయన మరణానికి కారణమైన డాక్టర్‌ను నిందితుడిగా పేర్కొంటూ శిక్ష విధించారు.

    English summary
    Michael Jackson made $75 million (Rs 528 crore) in 2017, enough to make him the world’s highest earning dead celebrity, according to Forbes. Michael Jackson remains the highest earning dead celebrity in the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X