Oscars 2023 వేదికపై నమస్తే.. కీరవాణి ఎమోషనల్.. స్పీచ్ ఎలా సాగిందంటే?
భారతీయ సినిమా ప్రేక్షకుడు కలలు కన్న సమయం నిజమైంది. అందరూ ఊహించినట్టే RRR సినిమాలోని నాటు నాటు పాట అంతర్జాతీయ సినీ వేదికపై సత్తా చాటింది. అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతూ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొన్నది. అమెరికాలో అట్టహాసంగా జరిగిన వేడుకలో RRR చిత్రాన్ని ఆస్కార్ వరించింది. ఆస్కార్ అవార్డు అందుకొన్న సమయంలో కీరవాణి ఉద్వేగంగా సాగిన ప్రసంగం మీ కోసం..

దిగ్గజ సంగీత దర్శకులతో పోటీ
ప్రపంచవ్యాప్తంగా దిగ్జజ సినీ ప్రముఖులు రూపొందించిన ఆల్బమ్స్‌తో RRR చిత్రంలోని పాట పోటీ పడింది. లేడి గాగ పాడిన హోల్డ్ మై హ్యాండ్, రిహన్నా పడిన లిఫ్ట్ మీ అప్, మిట్ స్కీ పాడిన ఆప్లాజ్ పాటల సరసన నాటు నాటు నిలిచింది. ప్రపంచ స్థాయి దిగ్గజాల పాటతో పోటీ పడుతూ నాటు నాటు ఆస్కార్ కిరిటాన్ని సాధించింది.
రాహుల్ సిప్లిగంజ్ లైవ్
ఆస్కార్ వేదికపై ప్రపంచస్థాయి అగ్ర నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేదికపై గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ చేశారు. విదేశీ నటీనటులతో కలిసి స్పెప్పులు వేశారు. ఈ పాటకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది.
వేదికపైకి కీరవాణి, చంద్రబోస్
95 అకాడమీ వేదికపై ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు పాటకు అవార్డు ప్రకటించారు. దాంతో సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లగానే.. ఆడిటోరియం దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. స్టాండింగ్ ఓవేషన్‌తో వారిని అభినందించారు. సంగీత ప్రియుల కరధ్వనుల మధ్య కీరవాణి, చంద్రబోస్ ఎమోషనల్ అయ్యారు.

భారతీయులందరికి గర్వంగా
థ్యాంక్యూ అకాడమీ. నేను ఎంతో మంది సంగీతాన్ని వింటూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్‌తో మీ ముందు నిలుచున్నాను. రాజమౌళి, నా ఫ్యామిలీకి ఖ్యాతి దక్కడం ఆనందంగా ఉంది. భారతీయులందరికీ నాటు నాటు పాట గర్వంగా నిలిచింది. ఈ కలను సాకారం చేసిన కార్తీకేయకు నా థ్యాంక్స్ అని కీరవాణి ఎమోషనల్ అయ్యారు.

నమస్తే అంటూ చంద్రబోస్
సంగీత దర్వకుడు కీరవాణితో వేదికపైకి వెళ్లిన రచయిత చంద్రబోస్ భావోద్వేగానికి గురయ్యాడు. తన చేతికి అందిన ఆస్కార్ అవార్డుతో అభివాదం చేస్తూ కనిపించారు. చివర్లో నమస్తే అంటూ అభివాదం చేసి వేదికపై నుంచి నిష్క్రమించారు.


Click it and Unblock the Notifications











