పెదరాయుడు స్పెషల్ డే.. సన్ ఆఫ్ ఇండియా నుంచి మరో సర్‌ప్రైజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం అనంతరం మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి స్ట్రాంగ్ గా రెడీ అవుతున్నారు. ఒకప్పుడు గ్యాప్ లేకుండా బాక్సాఫీస్ హిట్స్ చూసిన ఆయన మెల్లగా సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆఫర్స్ చాలానే వస్తున్నా కేవలం నచ్చిన సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడు.
ఇటీవల విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాతో సరికొత్త మెస్సేజ్ ఇవ్వడానికి మోహన్ బాబు పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆరు పదుల వయసులోకి వచ్చినా కూడా ఎనర్జి ఏ మాత్రం తగ్గలేదని టీజర్ చూస్తేనే అర్ధమయ్యింది. ఇక జూన్ 15న సినిమాకు సంబంధించిన జయ జయ మహావీర అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

ఆ తేదీనాడు ఒక ప్రత్యేకత ఉందని కూడా మోహన్ బాబు వివరణ ఇచ్చారు. 1995 జూన్ 15వ తేదీన పెదరాయుడు సినిమా విడుదలైంది. మళ్ళీ 26 సంవత్సరాలు అనంతరం అదే రోజున సన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మొదటి లిరికల్ సాంగ్ విడుదలవుతున్నందుకు శుభసూచికంగా బావిస్తున్నట్లు చెప్పారు. ఇక అప్పుడు పెదరాయుడు సినిమాను నేను నిర్మిస్తే ఇప్పుడు నా తనయుడు విష్ణువర్ధన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా రాహుల్ నంబియర్ మొదటి పాటను పాడారు. ఈ పాటను శ్రీరాముడికి అంకితం ఇవ్వబోతున్నట్లు మోహన్ బాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











