అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ కేక, సెట్స్‌కు వచ్చి అభినందించిన రామ్ చరణ్!

'హలో' తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.

జనవరి 25న తన చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ విడుదల చేశారు. థమన్ అందించిన ట్యూన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మ్యూజిక్ పరంగా సినిమాకు మరింత ప్లస్సయ్యే అంశం ఇది.

 రిలిక్స్ అదిరిపోయాయి

రిలిక్స్ అదిరిపోయాయి

దేవదాసు మనవడో... మన్మదుడికి వారసుడో... కావ్యములో కాముడో.... అంతకన్నా రసికుడో... అంటూ శ్రీమణి అందించిన లిరిక్స్ బట్టి ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టరైజేషన ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రంలో అకిఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. ఇందుకోసం మూడు నెలలు నరకం అనుభవించాను. అయితే ఈ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నట్లు అఖిల్ తెలిపారు.

‘మిస్టర్ మజ్ను' సెట్స్‌లో రామ్ చరణ్

‘మిస్టర్ మజ్ను' సెట్స్‌లో రామ్ చరణ్

తాజాగా విడుదలైన పాటలో ‘మిస్టర్ మజ్ను' సెట్స్‌ను రామ్ చరణ్ సందర్శించినట్లు తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీలో ఉన్న అకిల్... శేఖర్ మాస్టర్ సారథ్యంలో డాన్స్ ఇరగదీయడంతో చెర్రీ అభినందిస్తున్న విషయం దృశ్యం అక్కడ చూడొచ్చు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

'తొలి ప్రేమ' సినిమాతో విజయం అందుకున్న వెంకీ అట్లూరి రూపొందిస్తున్న యూత్‌ఫుల్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అఖిల్ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత షైన్ అవుతాడనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X