twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుప్రసిద్ద సంగీత దర్శకుడు వన్‌రాజ్ భాటియా కన్నుమూత.. సృతి ఇరానీ, ఫరాన్ అఖ్తర్ తీవ్ర దిగ్బ్రాంతి

    |

    సుప్రసిద్ధ సంగీత దర్శకుడు వన్‌రాజ్ భాటియా ఇకలేరు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దికాలంగా బెడ్‌కే పరిమితమయ్యారు. ఇంటిలోనే చికిత్స పొందుతున్న వన్‌రాజ్ భాటియా శుక్రవారం (మే 7వ తేదీన) తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. ఈ విషాద ఘటనతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసిందనే అభిప్రాయాన్ని సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

    ఇండియన్ న్యూ వేవ్ సినిమాకు ఆద్యుడిగా పేర్కొనదగిన సంగీత దర్శకుడు వన్‌రాజ్ మే 31, 1927లో బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి (ప్రస్తుత ముంబై)లో కచ్చి వ్యాపార కుటుంబంలో జన్మించారు. యుక్త వయసులో చైకోవ్‌స్కీ పియానో కన్సెర్ట్ నంబర్ 1 విన్న తర్వాత ఆయన ధియోధర్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లోనూ, న్యూ ఎరా స్కూల్‌లో హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్ స్టూడెంట్‌గా చేరారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బొంబాయి పరిధిలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజి నుంచి ఎంఏ హానర్‌లో పట్టా పుచ్చుకొన్నారు.

    Music Composer Vanraj Bhatia no more, dies at 93

    1954 తర్వాత రాక్‌ఫెల్లర్ స్కాలర్ షిప్, ప్రెంఛ్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్ సాధించి పారిస్‌లో సంగీతంలో మరింత ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత 1959లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన లిరిల్, డ్యులక్స్, గార్డెన్ వరెలీ ఉత్పత్తులకు జింగిల్స్ అందించారు.

    1974లో శ్యాంబెనగల్ దర్శకత్వం వహించిన అంకుర్ సినిమాకు సంగీతం అందించారు. మంథన్ చిత్రంలో మేరే గమ్ కథా పారే పాటతో అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నారు. అప్పుడే మొదలైన ఇండియన్ న్యూ వేవ్ ఉద్యమంలో భాగస్వామ్యమై గోవింద్ నిహ్లానీ (తమస్ సీరియల్ ), కుందన్ షా (జానే భీ దో యారో), అపర్ణాసేన్ (36 చౌరంగీ లేన్), సయీద్ అఖ్తర్ మీర్జా (మోహన్ జోషి హాజిర్ హో), కుమార్ సహానా (తరంగ్), విదూ వినోద్ చోప్రా (ఖామోష్, విజయ్ మెహతా (పెస్టోంజి), ప్రకాశ్ ఝా (హిప్ హిప్ హుర్రే) లాంటి దర్శకులతో పనిచేశారు. 90వ దశకంలో అజూబా, దామిని, పర్‌దేశ్ లాంటి చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

    Music Composer Vanraj Bhatia no more, dies at 93

    వన్‌రాజ్‌ భాటియా ప్రతిభ కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. బుల్లితెరపై ఖాందాన్, యాత్ర, వాగ్లేకి దునియా, బనేగి అప్నీ బాత్, భారత్ ఏక్ కోజ్, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ది డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి డాక్యుమెంటరీలకు సంగీతం అందించారు.

    ది హౌస్‌హోల్డర్ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించిన వన్‌రాజ్ భాటియా ఆ తర్వాత నిశాంత్, జునూన్, పితా, బేఖుదీ, చమత్కార్, సూరజ్ కా సత్వా ఘోడా, ద్రోహ్‌కాల్, బండీష్, ఘాతక్, చైనా గేట్, సమర్, హరిబరీ, చమేలీ లాంటి చిత్రాలకు పనిచేశారు. చివరిగా 2008లో హల్లాబోల్ సినిమాకు ఓ పాటకు సంగీతం అందించారు.

    1988లో తమస్ టెలివిజన్ సీరియల్‌కు గానూ ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 1989లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. భారతీయ సంగీతానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు 2012లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

    వన్‌రాజ్ మృతికి ప్రముఖ నటి, రాజకీయ వేత్త సృతీ ఇరానీ, ప్రముఖ నటుడు ఫరాన్ అఖ్తర్, దర్శకుడు హన్సల్ మెహతా తదితరులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. వన్‌రాజ్ భాటియా మృతి వార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాం. వాగ్లే కి దునియా, జానే భీ దో యార్ లాంటి చిత్రాలతో సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని సంతాపం తెలిపారు

    English summary
    Popular Music Composer Vanraj Bhatia no more, dies at 93. In this tragic occasson, Smriti Z Irani, Hansal Mehta, Farhan Akhtar condolenced to popular music director. Smriti Z Irani tweeted that Shocked to learn about the passing away of Vanraj Bhatia. Wagle ki Duniya , Jaane Bhi Do Yaaron, he leaves behind countless memories in his scores. My condolences to his loved ones & fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X