Vikram: మ్యూజిక్ డైరెక్టర్ కు కమల్ హాసన్ గిఫ్ట్ ఇవ్వలేదు.. అనిరుధ్ దిమ్మతిరిగే కౌంటర్!
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. విక్రమ్ సినిమా అందించిన విజయంతో కమల్ హాసన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమిళ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ 300కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమా అందించిన విజయంతో కమలహాసన్ చిత్ర యూనిట్ సభ్యుల్లో కొంతమందికి ఖరీదైన కానుకలను కూడా ఇచ్చాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనే విషయంలో ఇటీవల ఒక ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్న పై అనిరుధ్ ఎవరూ ఊహించని విధంగా ఒక సమాధానం ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్గెస్ట్ హిట్
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా విక్రమ్ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా కు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో నితిన్ ఫాదర్ ఈ సినిమాను విడుదల చేసిజ విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

60 లక్షల విలువైన కారు
కమలహాసన్ సినిమా కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సాధించిన విజయానందంలో కమల్ హాసన్ చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా కొన్ని ఖరీదైన కానుకలను ఇచ్చాడు. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ దర్శకత్వ ప్రతిభకు 60 లక్షల విలువైన ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాకు కష్టపడి పనిచేసిన సహాయక దర్శకుల కోసం ప్రత్యేకమైన బైక్లను కూడా అందించాడు.

సూర్య కోసం
అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రోలెక్స్ సూర్య కోసం ఖరీదైన 40 లక్షల విలువ చేతి గడియరాన్ని బహుమతిగా ఇచ్చాడు. విక్రమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి కూడా కమల్ హాసన్ ఏదో ఒక బహుమతి అయితే ఇచ్చారు. ఒక విధంగా ఈ సినిమాతో ఆయన ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు అనే చెప్పాలి.

మ్యూజిల్ డైరెక్టర్ కు ఇవ్వలేదట
ఇక ఈ ఆనందంలో అందరికీ బహుమతి ఇచ్చిన కమల్ హాసన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కోసం మాత్రం ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకు సంబంధించిన వార్తలు కూడా తమిళ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అయితే ఒక విధంగా ఈ సినిమా విజయంలో అనిరుద్ రవిచంద్రన్ కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

అనిరుధ్ కౌంటర్
ఇక సంగీత దర్శకుడికి కమల్ హాసన్ ఎందుకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ కు ఆ ప్రశ్న ఎదురయింది. ఇక ఆ ప్రశ్నపై ఈ యువ సంగీత దర్శకుడు చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. 'నాకు విక్రమ్ సినిమా చేసే అవకాశం ఇచ్చారు అంత కంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి' అని అనిరుధ్ ఇచ్చిన సమాధానంతో అందరూ క్లాప్స్ కొట్టేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


Click it and Unblock the Notifications











