Don't Miss!
- News
మహానాడు పెట్టింది అందుకేనా? చంద్రబాబు టీడీపీకి పట్టిన శని: మంత్రి రోజా హాట్ కామెంట్స్
- Automobiles
మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
- Sports
ఆర్సీబీ అభిమానుల పాలిట విలన్‌గా మారిన దినేష్ కార్తీక్.. ఎంత పెద్ద తప్పు చేశాడంటే?
- Finance
Petrol prices today: ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు తర్వాత కూడా స్థిరంగా పెట్రోల్ ధరలు
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంగీత స్వరకర్త ఏఆర్.రెహమాన్ ఇంట్లో పెళ్లి సందడి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్.. ఫ్యామిలీ ఫొటో వైరల్!
ప్రపంచంలోనే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన ఏఆర్.రెహమాన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీనేజ్ వయసు నుంచే ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఏ మాత్రం ఖాళీగా ఉండకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటారు. ఇక రెహమాన్ ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన విషయాలను బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. రీసెంట్ గా రెహమాన్ తన గారాలా కూతురు వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఐదేళ్ల వయసులో..
ఏఆర్.రెహమాన్ ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఐదేళ్ల వయసులో ఆట బొమ్మలతో ఆడుకోవాల్సిన రెహమాన్ ఏకంగా సంగీత వాయిద్యాలతో కాలాన్ని గడిపాడు. ఇక చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో అతను కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. తన సోదరిని తల్లి కోసం హార్డ్ వర్క్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నాడు.

కుమార్తె వివాహం
ఇక ఏఆర్.రెహమాన్ ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. రీసెంట్ గా AR రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఆడియో ఇంజనీర్ రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది.

రెహమాన్ స్పెషల్ పోస్ట్
ఇక రెహమాన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఖతీజా రియాస్దీన్ వివాహానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. దేవుడు ఈ జంటను ఆశీర్వదిస్తాడని.. మీ శుభాకాంక్షలు అలాగే ప్రేమకు ముందుగానే ధన్యవాదాలు.. అని రెహమాన్ పేర్కొన్నాడు. ఆ ఫొటోలో పక్కనే రెహమాన్ దివంగత తల్లి చిత్రపటాన్ని కూడా ఉంచారు. రెహమాన్ కు తల్లి అంటే అమితమైన ప్రేమ. అందుకే ఇలా ఫొటోలో కూడా ఆమె జ్ఞాపకాలను ఉంచినట్లు తెలుస్తోంది.

స్పందించిన ఖతీజా
ఇక ఖతీజా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఆమె కూడా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. నా జీవితంలో చాలా ఎదురుచూస్తున్న రోజు ఇదే అంటూ నా వ్యక్తి రియాస్దీన్‌తో వివాహం.. జరగడం ఆనందంగా ఉంది అని ఆమె వివరణ ఇచ్చారు. ఇక గత ఏడాది డిసెంబర్ లోనే వీరి ఎంగేజ్మెంట్ ను కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు.

సెలబ్రెటీల స్పెషల్ విషెస్
ఖతీజా వివాహ వేడుకను కూడా రెహమాన్ అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఇక పెళ్లి సందర్భంగా కొంతమంది గాయనిమణులు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రేయా ఘోషల్ స్పందిస్తూ.. ఖతీజా రెహమాన్, రియాస్దీన్‌లకు హృదయపూర్వక అభినందనలు అని అందమైన జంటను దేవుడు ఆశీర్వదిస్తాడని ఆమె పేర్కొన్నారు చిత్ర నిర్మాత బోనీ కపూర్ కూడా మిస్టర్ అండ్ మిసెస్ AR రెహమాన్‌కి అభినందనలు, ఈ జంట చాలా సంతోషంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక రెహమాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు అలాగే మణిరత్నం పాన్నియిన్ సెల్వన్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.