ఆ ఒక పాట కోసం కలవబోతున్న థమన్, దేవిశ్రీప్రసాద్.. కీక్కించే సర్‌ప్రైజ్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకులుగా కొనసాగుతున్న వారిలో దేవి శ్రీ ప్రసాద్, థమన్ టాప్ లిస్టులో ఉంటారు. ఈ ఇద్దరూ కూడా ఒకే తరహాలో పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఒకవైపు దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్ ఇండియా సినిమాలతో కూడా బిజీ అవుతుండగా మరొకవైపు థమన్ కూడా అదే తరహాలో అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ ఇద్దరి చేతుల్లో కూడా ఇప్పుడు అతిపెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అయితే పుష్ప సినిమా తర్వాత ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ తో కూడా రెడీ అవుతున్నాడు. ఇక మరోవైపు థమన్ గ్యాప్ లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల కాలంలో అతను ఎలాంటి సినిమాకు మ్యూజిక్ అందించిన కూడా అవి బెస్ట్ ఆల్బమ్స్ గా నిలుస్తున్నాయి.

లవ్ స్టోరీ లతోపాటు కమర్షియల్ సినిమాలకు కూడా బాగానే ట్యూన్స్ చేస్తున్న థమన్ నెక్స్ట్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంగీతం అందించబోతున్న విషయం తెలిసింది. అయితే ఇండస్ట్రీలో తీవ్రమైన పోటీ కొనసాగుతున్న సమయంలో దేవిశ్రీప్రసాద్ థమన్ ఇద్దరు కూడా కలిసి వర్క్ చేస్తే చేస్తే చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఇప్పుడు నిజంగానే ఈ ఇద్దరు ఒక పాట కోసం కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల చివరలో ఐపీఎల్ 2023 సరికొత్త సీజన్ మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అందులో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోసం ప్రత్యేకంగా థమన్ దేవి శ్రీ ప్రసాద్ ఒక పాటను కంపోజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఎవరు కంపోజ్ చేస్తారు ఎవరు పాడుతారు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇద్దరు మాత్రం కలిసి సన్ రైజర్స్ కోసం అద్భుతమైన పాట రెడీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. థమన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇదివరకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా ఆడాడు. ఇక దేవిశ్రీప్రసాద్ కు కూడా క్రికెట్ అంటే ఎంతగానో ఇష్టం. కానీ ఎప్పుడు ఆ ఆటతో అతను కనిపించింది లేదు. మరి SRH కోసం ఈ ఇద్దరూ ఎలాంటి ట్యూన్ అందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











