ఆ హీరోకు మొదటిసారి మ్యూజిక్ అందిస్తున్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్
ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయినా కూడా దేవి శ్రీ ప్రసాద్ అలుపు లేకుండా అదే ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు. ఎలాంటి పాట కంపోజ్ చేసినా కూడా అన్ని వర్గాల వారికి నచ్చేలా ట్యూన్స్ సెట్ చేయడం దేవికి వెన్నతో పెట్టిన విద్య. ఇక మారుతున్న కాలానికి తగ్గట్లుగానే దేవి మ్యూజిక్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇక రాక్ స్టార్ ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతో వర్క్ చేశాడు.
కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో కూడా వర్క్ చేశాడు. అగ్ర దర్శకులు సైతం చాలా వరకు దేవి శ్రీ ప్రసాద్ ను అదే పనిగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మెగా హీరోల్లో చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరి సినిమాలకు ట్యూన్స్ అంధించాడు. ఇక దేవి కవర్ చేయాల్సిన మరికొందరు మీడియం హీరోలు ఉన్నారు. గోపిచంద్, శర్వానంద్ వంటి వారికి ఇంతవరకు మ్యూజిక్ చేయలేదు. ఇక త్వరలోనే ఆ కాంబినేషన్స్ కూడా సెట్ కాబోతున్నాయి.

గోపీచంద్ సినిమాకు ఇంకా ఫైనల్ కాలేదు గాని శర్వానంద్ కు మాత్రం సెట్టయినట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో హీరో శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. దర్శకుడు కిషోర్ ఇదివరకు చేసిన నేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగి, చిత్రాలహరి వంటి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంధించాడు. మరి ఈసారి శర్వానంద్ సినిమాకు రాక్ స్టార్ ఎలాంటి సాంగ్స్ ను కంపోజ్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











