Mani Sharma: "తమన్ గాడు అన్నీ అబద్ధాలు చెబుతాడు.. నాకు ప్రోగ్రాం నచ్చకపోతే స్పీకర్లు పగులగొడుతా"
ది లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి, ఆయన టాలెంట్ గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన మ్యూజిక్ తో అందరినీ ఓలలాడించే ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి గురువారం రోజుకు సరిగ్గా 30 ఏళ్ల అవుతుంది. ఈక్రమంలోనే ఆయన సూపర్ సింగర్ ప్రోగ్రాంకు హాజరు అయ్యారు. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా తమన్ అన్నీ అబద్ధాలే చెబుతాడని.. తనకు ప్రోగ్రాం నచ్చకపోతే స్పీకర్లు పగులగొట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చాలా మంది సినీ ప్రముఖులు, డైరెక్టర్లు, హీరోలు అంతా ఆయన గురించి చాలా చక్కని మాటలు చెప్పారు. మణిశర్మతో తమకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ఆయన స్టేజీపైకి రాగానే గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు... సూపర్ సింగ్ ప్రోగ్రాం నిర్వాహకులు, టీం మెంబర్లు, జడ్డిలు. ఈక్రమంలోనే సింగర్ మంగ్లీ.. మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది, చేతులు వణుకుతున్నాయని చెప్పుకొచ్చింది. అదంతా విన్న మణిశర్మ... పాట గట్టిగానే పాడతావు మరి ఇదేంటని అడిగారు. దీంతో తెగ సిగ్గుపడిపోయిందీ టాప్ సింగర్.

ఇక తర్వాత నేను మాట్లాడేటప్పుడు చాలా స్లో అయిపోతా.. రికార్డింగ్ స్టూడియోలో చాలా అయిపోతానంటూ మణిశర్మ చెప్పగా.. ఆ తెలుసు సార్ అంటూ మంగ్లీ అనింది. హా ఏంటి.. నీకేం తెలుసు అని మణిశర్మ అన్నాడు. అలాడే వాడేమైనా చెప్పాడా అంటూ రాహుల్ సిప్లిగంజ్ మొహం చూశాడు. మరోవైపు రాహుల్.. మాటల్లేవు.. ఓన్లీ పాటలే అంటూ మణిశర్మ గురించి వివరించారు. ఇక వాళ్లంతా కిందకు వెళ్లగా.. ఒక్కొక్కరూ వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈక్రమంలోనే ఓ కంటెస్టెంట్ వచ్చి రావయ్యా ముద్దుల బావ అని పాట పాడింది.
అది అయిపోగానే.. శ్రీముఖి ఇది మీ నాన్నగారికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ కదా అంటూ మణిశర్మను అడుగుతుంది. అదంతా విన్న అవును అంటూ చెప్పగా అంతా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత ఆయన వయోలిన్ వాయిస్తున్న చిన్నపటి ఫొటో పెట్టగా.. తాను ఫస్ట్ అదే నేర్చుకున్నానని కాకపోతే ఇది చిన్నగా ఉంది.. కీబోర్డు ఏదో చాలా పెద్దగా ఉంది కదా అనుకుని అది నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత అనంత శ్రీరామ్... మణిశర్మతో మాట్లాడుతూ కనిపించారు.

ఎక్కువగా రిథమ్ ప్రోగ్రాంలు చేస్తున్న వాళ్ల వద్దకు వెళ్లి అది నచ్చకపోతే స్పీకర్లు పగులగొడుతారంట కదా మీరు అని అడిగారు. దీనికి మణిశర్మ వెంటనే ఆ తమన్ గాడు చెప్పాడా..... వాడన్నీ అబద్ధాలే చెబుతాడు.. అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఏంటి ఇది జరగలేదా అని అనంత శ్రీరామ్ అనగా.. ఒక్కసారి జరిగిందిలే అంటూ సమాధానం చెప్పాడు. ఇలా ఈ షో అంతా ఆద్యంతం ఆకట్టుకుంది. ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు రాబోయే ఈ షోను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











