ఖుషి టైమ్‌లో థమన్ ఇంకా పుట్టనేలేదు, థమన్ గాలి తీసేసిన మణిశర్మ.. ఆ పాటకు వర్క్ చేసింది మేమే అంటూ..

ఎక్కడైనా సరే ఒక క్యాటగిరికి చెందిన టెక్నీషియన్స్ మధ్యలో పోటీతత్వం చాలా బలంగా ఉంటుంది. ఇక సినిమా పరిశ్రమలో కూడా టాలెంట్ ఉన్నవాళ్లే ఎక్కువ కాలం కొనసాగుతుంటారు. అయితే కొన్నిసార్లు ఒకరు చేసిన వర్క్ వాల్యూ మరొకరికి వెళుతుంటుంది. ఈ విషయంలో అనేక మంది అసలు నిజలని బయటపెట్టారు. ఇక రీసెంట్ గా దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నవ్వుతూనే ఒక్కసారిగా గాలి తీసేసినట్లు కౌంటర్ ఇచ్చాడు.

కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్‌డే స్పెషల్ ఫొటోలు)

 మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలో..

మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలో..

నిజానికి సంగీత ప్రపంచంలో గాయకులు మ్యూజిక్ డైరెక్టర్స్ సున్నితమైన మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ వారిలో ఉండే పోటీతత్వం మాత్రం భయంకరంగా ఉంటుందని చాలా ఉదాహరణలు బయటకు వచ్చాయి. దర్శకులు, ఇతర నటీనటుల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలో మాత్రం మంచి వాతావరణం లేదని కొంతమంది కామెంట్స్ బట్టి అర్ధమవుతొంది.

 పోటీ అనేది తప్పకుండా ఉండాలని

పోటీ అనేది తప్పకుండా ఉండాలని

సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడి సినిమా ఈవెంట్ కు మరొక దర్శకుడు రావడం కామన్. కానీ సంగీత దర్శకుల్లో అలాంటి వాతావరణం ఎక్కువగా కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న వారిలో థమన్ ఒకరు. ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో కూడా పోటీ అనేది తప్పకుండా ఉండాలని ఓపెన్ గానే చెప్పేశారు.

 అగ్ర సంగీత దర్శకుల దగ్గర

అగ్ర సంగీత దర్శకుల దగ్గర

ఇక థమన్ 12ఏళ్ళ వయసు నుంచే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టి అనేక మంది అగ్ర సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశాడు. కోటి, రెహమాన్, కీరవాణి వంటి సీనియర్లు వద్ద వర్క్ చేసిన థమన్ ఎక్కువగా మణిశర్మ దగ్గర నెర్చుకున్నట్లు చెప్పేవాడు. మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి ఆయన కూడా ఒక స్ఫూర్తిగా నిలిచినట్లు పాజిటివ్ కామెంట్స్ చేశాడు.

ఖుషి సాంగ్స్ లో థమన్ పాత్ర?

ఖుషి సాంగ్స్ లో థమన్ పాత్ర?

అయితే ఖుషి సినిమా టైమ్ లో థమన్ కూడా మ్యూజిక్ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు ఒక టాక్ వచ్చింది. ఖుషి ఫస్ట్ సాంగ్ 'ఏ మేరా జహా' సాంగ్ కు డ్రమ్స్ వాయించినట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల వకీల్ సాబ్ ఈవెంట్ లో ఆ విషయాన్ని గుర్తు చేయడంతో ఆ న్యూస్ బాగానే వైరల్ అయ్యింది.

Recommended Video

Pawan Kalyan The Real Trend Setter In Tollywood | #20YearsForClassicIHKushi || Filmibeat Telugu
థమన్ ఇంకా పుట్టనే లేదు

థమన్ ఇంకా పుట్టనే లేదు

ఇక రీసెంట్ గా ఖుషి విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మణిశర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ పై షాకింగ్ కామెంట్ చేశారు. ఆ సినిమా టైమ్ లో థమన్ ఇంకా పుట్టనేలేదు ఆనేశాడు. మళ్ళీ ఆ వెంటనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఆ టైమ్ లో ఇంకా పుట్టలేదు అని ఆ పాటకు కంపోజ్ చేసింది నేను అలాగే రిక్కి డీకోస్టా, రాజు అని వివరణ ఇచ్చారు. థమన్ మాత్రం అప్పుడు పక్కన మాత్రమే ఉన్నట్లు మణిశర్మ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X