రాజమౌళి ఫ్యామిలీతో విబేధాలు.. అందుకే ఛాన్స్ ఇవ్వరు: కీరవాణి సోదరి కామెంట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఫ్యామిలీలో సినిమాలకు వర్క్ చేసే టెక్నీషియన్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన వారు అయితే ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఎం.ఎం.కీరవాణి సోదరి MM శ్రీలేఖ కూడా మ్యూజిక్ కంపోజర్ గా మంచి గుర్తింపు అందుకున్నారు. అయితే ఆమె రాజమౌళి కుటుంబ సభ్యులందరికీ కాస్త దూరంగా ఉంటుంది అని వారితో విభేదాలు ఉన్నాయి అని అందుకే ఆమెకు అవకాశాలు ఇవ్వరని ఒక టాక్ కూడా ఇండస్ట్రీలో వచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఆమె రాజమౌళి రికమాండ్ చేయడం వల్లనే హిట్ 2 లో ఆఫర్ వచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ విషయాలన్నిటిపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలేఖ తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

17 ఏళ్ళ వయసులోనే..

17 ఏళ్ళ వయసులోనే..

ఫిలిమ్ కంపోజర్ గా ప్లే బ్యాక్ సింగర్ గా సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఎం.ఎం శ్రీలేఖ 1996 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మొదట సింగర్ గా గుర్తింపును అందుకున్న తర్వాత 17 ఏళ్ళ వయసులోనే ఆమె మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ను స్టార్ట్ చేశారు. ఆమె ఎమ్ఎమ్.కీరవాణి సొంత సోదరి అని అందరికీ తెలిసిన విషమే.

హిట్ 2 కోసం..

హిట్ 2 కోసం..

కీరవాణి తర్వాత ఆయన సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగారు. అయితే ఆయన కంటే ఎక్కువ స్థాయిలో సోదరి శ్రీలేఖ ఎక్కువగా సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు దాదాపుగా 80కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇక ఇటీవల హిట్ 2 సినిమాకు కూడా ఆమె ఒక పాటకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

అవకాశం ఇవ్వకపోవడంతో..

అవకాశం ఇవ్వకపోవడంతో..

అయితే హిట్ 2 సినిమాకు రాజమౌళి రికమెండ్ చేయడం వలన నాని ఆ విధంగా అవకాశం వచ్చేలా చేశాడాని.. అంతేకాకుండా ఎక్కువగా కీరవాణి సపోర్ట్ తోనే ఆమెకు మ్యూజిక్ చేసే అవకాశాలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. ఇక మరికొన్ని రూమర్స్ లో అయితే రాజమౌళి తన సినిమాలకు అవకాశం ఇవ్వకపోవడంతో కొంత విభేదాలు కూడా వచ్చాయని వార్తలు అయితే వచ్చాయి. ఇక వాటిపై ఎంఎం శ్రీలేఖ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రాజమౌళి సినిమాలకు

రాజమౌళి సినిమాలకు

రాజమౌళి దాదాపు తన సినిమాకు వర్క్ చేసే చాలామంది వారికి కుటుంబ సభ్యులు ఉంటారు. అయితే కీరవాణి సోదరి ఎంఎం శ్రీలేఖ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్నప్పటికీ జక్కన్న తన సినిమాలకు ఎందుకు అవకాశం ఇవ్వరు అనే ప్రశ్నకు కూడా శ్రీలేఖ సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. రాజమౌళి గారికి కీరవాణి మీద చాలా నమ్మకం ఉంది. వారి ఇద్దరిదీ ఒక కాంబినేషన్. అంతేకాకుండా రాజమౌళి గారికి ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అందుకే నాకు అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో నా అవసరం పడితే తప్పకుండా ఆయన అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను అని శ్రీలేఖ తెలియజేశారు.

విబేధాలు లేవు

విబేధాలు లేవు

అంతేకాకుండా రాజమౌళి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని శ్రీలేఖ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో మొదట్లో కొంత సపోర్ట్ ఉన్న మాట నిజమే కానీ ఆ తర్వాత 70 నుంచి 80 సినిమాలకు పైగా నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. దాదాపు అన్ని కూడా నా సొంతంగా అవకాశాలు అందుకున్నవే.. అని శ్రీలేఖ తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X