Don't Miss!
- News
బీహార్ పాలిట్విస్ట్: నితీష్ కుమార్‌కు ఫోన్ చేసిన అమిత్ షా, రేపు ఏం జరుగుతుందో?
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
'జోష్' నింపుతూ దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ పీవీఆర్ రాజా..
అందరికీ తాము కన్న కలలు సాకారం చేసుకోవాలనే ఉంటుంది కానీ అందులో కొందరే సఫలం అవుతారు. అలా సంగీత దర్శకుడు అవ్వాలన్న కల సాకారం చేసుకున్నారు విజయనగరానికి చెందిన పీవీఆర్ రాజా. ఆయన కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు లిరిసిస్ట్, గిటారిస్ట్ కూడా. డిగ్రీ పూర్తి చేసిన పివిఆర్ రాజా సంగీతంలో రాణించాలని ఐదు వేల రూపాయలతో ఇంట్లో చెప్పకుండా 2006లో హైదరాబాద్ చేరుకుని స్నేహితుల సలహాతో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. తొమ్మిది నెలలైనా సినీమా షూటింగ్ మొదలు కాకవపోవడంతో సైనిక్ పురిలో సింఫనీ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ టీచర్ గా చేరి నెమ్మదిగా సంగీతం మీద దృష్టిపెట్టారు.
విదేశాలలో షార్ట్ పిలీమ్స్ తీసే వారు పివిఆర్ రాజాతో సంగీతం చేయించుకోవడం ప్రారంభించడంతో ఆయన సంగీతం సమకూర్చిన వెన్నెల వచ్చే పదమని పాటకి సంగీత దర్శకుడు కోటి అభినంధించడం జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకం అంటుంటారు పివిఆర్ రాజా. సింగర్ కారుణ్య పాడిన ఈ పాట తనకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చింది. రాజా ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ అందించినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఐఎండిబి, తెలుగు వికీపీడియా సైతం స్థానం సొంతం చేసుకున్నారు. ఫేస్ బుక్, స్పాటిఫై మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, జియో సావన్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక జోష్ యాప్ లో కూడా మంచి మ్యూజిక్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆయన 2013 హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పేస్ 2013 కంపిటిషన్స్ లో ఫైనల్స్ కి ఎంపిక అయ్యారు. కేవలం 2017 ఒక్క సంవత్సరంలో తాను సంగీతం చేసిన షార్ట్ ఫిలిమ్స్ కి గాను వరుసగా 7 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకోవడం విశేషం. 2016 తెలుగు షార్ట్ ఫిలిమ్స్ లో నిరంతర సంగీత సేవలకు గాను షార్ట్ ఫిలిం డైమండ్ అవార్డు (నవరత్నాలు) తో సత్కరించారు. అంతేకాక 2020 రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో , తొమ్మిదివేల ఎంట్రీలలో , PVR రాజా నేపధ్య సంగీతం చేసిన 3 చిత్రాలు టాప్ 18 లో నిలిచాయి , వాటిలో రెండు చిత్రాలు టాప్ 5 లో స్థానం సంపాదించి ఉత్తమ చిత్రాలుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి.

పీవీఆర్
రాజా
చేయబోయే
ప్రాజెక్టులు
మూవీ:
మది
(తెలుగు)
ఇప్పటికే
రెండు
పాటలు
రిలీజ్
అయ్యాయి.
ఈ
సినిమా
2022
సంవత్సరం
చివర్లో
రిలీజ్
అయ్యే
అవకాశం
ఉంది.
ఆదిత్య
మ్యూజిక్
రిలీజైన
సాంగ్స్:
త్వరలోనే ఆవిష్కరణకు సిద్దమవుతున్న పుస్తకం