twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన థమన్.. అడగకముందే వాళ్ళే ఇస్తారట!

    |

    ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస మ్యూజికల్ హిట్స్ తో దూసుకుపోతున్న సంగీత దర్శకుల్లో థమన్ టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా తర్వాత థమన్ ఒక్కసారిగా స్పీడ్ పెంచాడు. అంతకు ముందు వరకు కాస్త నెమ్మదిగా వెళుతూ వచ్చిన తమన్ ఆ తర్వాత ఎక్కువగా మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. హీరో ఎవరైనా సరే దర్శకుడు ఎంత పెద్దవారైనా సరే కథ నచ్చితే గాని తమ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ ప్రస్తుతం అందుకుంటున్న విషయం గురించి క్లారిటీ అయితే ఇచ్చాడు.

    కథలు నచ్చకపోయినా..

    కథలు నచ్చకపోయినా..

    2008 నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్న థమన్ ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది పదికి పైగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో అత్యధిక వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన సంగీత దర్శకుడిగా కూడా తమన్ రికార్డును అందుకున్నాడు. ఒకప్పుడు థమన్ కొంతమంది అగ్రనిర్మాత ల కారణంగా కథలు నచ్చక పోయినా సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం కొంత కాలం పాటు గట్టిగానే చూపించింది. అందుకే ఎవరి ప్రభావం వలన బలవంతంగా సంగీతం చేయడానికి ఒప్పుకోవడం లేదు.

    రోజుకు 16 గంటలు

    రోజుకు 16 గంటలు

    ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖండ సినిమా గురించి చాలా విషయాలను చెప్పిన థమన్ టైటిల్ సాంగ్ కోసం దాదాపు నెల రోజుల పాటు కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు. అంతే కాకుండా బాలకృష్ణ చెప్పిన శ్లోకాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా జత చేసి నట్లు వివరణ ఇచ్చాడు . ప్రస్తుతం చేతిలో అత్యధిక సినిమాల్లో కొనసాగుతున్న థమన్ రోజుకు 16 గంటల వరకు వర్క్ చేస్తున్నాడట.

    థమన్ చేతిలో 8 సినిమాలు

    థమన్ చేతిలో 8 సినిమాలు

    థమన్ చేతిలో ప్రస్తుతం 8 సినిమాలు ఉన్నాయి. ఇక త్వరలోనే మరో రెండు సినిమాలపై కూడా అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే అఖండ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఆ తర్వాత గని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తర్వాత వరుసలో భీమ్లా నాయక్ సినిమాతో పాటు సర్కారు వారి పాట, థాంక్యూ, గాడ్ ఫాదర్, RC15, మహేష్ బాబు 28వ ప్రాజెక్టులు కూడా తన చేతిలోనే ఉన్నాయి.

    రెమ్యునరేషన్ ఎంత?

    రెమ్యునరేషన్ ఎంత?

    ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న సంగీతదర్శకుడిగా కొనసాగుతున్న తనని పారితోషికం ఎంత అందుకుంటున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే థమన్ చేతికి ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమా బడ్జెట్ బట్టి కూడా కొన్ని సినిమాలకు చాలా తక్కువగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    క్లారిటీ ఇచ్చిన థమన్

    క్లారిటీ ఇచ్చిన థమన్

    ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనే విషయంపై స్పందించిన తమన్.. ఏది కూడా ఎక్కువ కాలం కొనసాగదు అంటూ.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ అనేదాన్ని నేను నమ్మను అని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా నిర్మాతలే తనకు అడగకముందే ఇవ్వాల్సిన పారితోషకం ఇచ్చేస్తారు అని, ఆ విషయంలో నేను ఎవరిని కూడా ఎప్పుడూ డిమాండ్ చేయలేదు అని థమన్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Music director S thaman about his remuneration
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X