ప్రముఖ సంగీత దర్శకుడి పరిస్థితి విషమం.. హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతూ..
బాలీవుడ్‌లో అత్యంత ఆదరణ పొందిన జంట మ్యూజిక్ డైరెక్టర్లు నదీమ్, శ్రవణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 90వ దశకంలో ఆషికీ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంగీత ద్వయంలో ఒకరైన శ్రవణ్ కుమార్ రాథోడ్ ప్రస్తుతం కరోనావైరస్ బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కోవిడ్ 19 బారిన పడిన ఈ సంగీత దర్శకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇతర ఆరోగ్య సమస్యలతోపాటు కరోనావైరస్ పాజిటివ్‌తో శ్రవణ్ ఆరోగ్యం క్షీణించింది. హాస్పిటల్‌లో చేరిన తర్వా త మరింత క్షీణించడంతో ఆయన పరిస్థితి ఆందోళనగా ఉంది. ప్రస్తుతం ముంబైలని రహేజా హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

ఇక నదీమ్, శ్రవణ్ మ్యూజిక్ విషయానికి వస్తే.. దిల్ హైకీ మాంతా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే, సాజన్, ఫూల్ ఔర్ కాంటే, సడక్, దీవానా, పర్‌దేశ్ లాంటి చిత్రాలకు సంగీతం అందించారు.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ ప్రముఖులను కరోనావైరస్ వెంటాడుతున్నది. రాహుల్ రాయ్, సోనుసూద్, అర్జున్ రాంపాల్, నీల్ నితిన్ ముఖేష్, సమీరా రెడ్డి లాంటి వాళ్లకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం తేలింది.


Click it and Unblock the Notifications











