twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.. సినీ పరిశ్రమను వెంటాడిన మరో విషాదం

    |

    ప్రముఖ సంగీత దర్శకుడు శ్రవణ్ అలియాస్ శ్రవణ్ కుమార్ రాథోడ్ ఇకలేరు. కొద్ది రోజులుగా కరోనావైరస్ బారిన పడి మృత్యువుతో పోరాడుతూ గురువారం (ఏప్రిల్ 22) తేదీన చివరి శ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ప్రముఖ సంగీత ద్వయం నదీమ్ శ్రవణ్‌లో శ్రవణ్ ఒకరనే విషయం తెలిసిందే. శ్రవణ్ మృతితో దిగ్బ్రాంతికి గురైన సినీ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

    గత కొద్దికాలంగా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రవణ్‌‌కు కరోనావైరస్ పాజిటివ్‌ అని తేలింది. దాంతో శ్రవణ్ ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ప్రస్తుతం ముంబైలోని రహేజా హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

     Music director Shravan no more: Music Industry lost another Legend

    మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మృతిపై సినీ ప్రముఖుడు అనిల్ శర్మ ట్విట్టర్‌లో స్పందించారు. చాలా దురదృష్టకరం. ఇప్పుడే శ్రవణ్ మరణించారనే దుర్వార్త తెలిసింది. ఆయన మనల్ని విడిపోయారనే విషయం నా గుండె పగిలేలా చేసింది. నాకు ఆయన అత్యంత సన్నిహితుడు. మహారాజా సినిమా కోసం కలిసి పనిచేశాం. ఆయన తన కెరీర్‌లో ఎన్నో అద్బుతమైన మెలోడిస్ అందించారు. ఈ విషాద సమయంలో శ్రవణ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆయన నా హృదయంలో చిరకాలం ఉండిపోతారు అని ట్విట్టర్‌లో భావోద్వేగానికి గురి అయ్యారు.

     Music director Shravan no more: Music Industry lost another Legend

    ఇక నదీమ్, శ్రవణ్ మ్యూజిక్ విషయానికి వస్తే.. దిల్ హైకీ మాంతా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే, సాజన్, ఫూల్ ఔర్ కాంటే, సడక్, దీవానా, పర్‌దేశ్ లాంటి చిత్రాలకు సంగీతం అందించారు.

    English summary
    Music director Shravan no more. Film maker Anil Sharam tweeted that V v sad .. just came to knw about the great music director #shravan he left all of us ..due to COVID .. very dear friend n colleague of mine .worked with him in #maharaja Always gave great melodies..my deepest condolences to his family. He will always remain in our hearts. RIP. Popular Music Director Shravan has been battling for life after Coronavirus positive. He was joined Raheja Hospital, Mahim, Mumbai. After joining in hospital, Shravan's deteriorated. Sharvan is popular in Duo of Nadeem Shravan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X