కాపీక్యాట్ ఆరోపణలు.. మరి కేసులు ఎందుకు పెట్టలేదు.. కౌంటర్ ఇచ్చిన థమన్

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా బిజీగా ఉన్న సంగీత దర్శకుడు థమన్. అయితే అతనిపై కాపీ ఆరోపణలు ఎన్ని సార్లు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఫస్ట్ మూవీ నుంచి కూడా ఏదో ఒక రకంగా ట్రోలింగ్ కు గురవుతున్న థమన్ కొన్నిసార్లు కాపీ క్యాట్ ఆరోపణలపై కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మరోసారి ఈ సంగీత దర్శకుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

మరో సాంగ్ కాపీ అంటూ ట్రోలింగ్స్

మరో సాంగ్ కాపీ అంటూ ట్రోలింగ్స్


ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా ఉంటున్న తెలుగు సంగీత దర్శకుల్లో థమన్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. కిక్ సినిమాతో మొదట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ మొదటి అవకాశం రావితేజ ఇవ్వడం వలన నిత్యం అతనికి రుణపడి ఉంటానని చెబుతూ ఉంటాడు. అయితే ఇటీవల రవితేజ సినిమాకు సంబంధించిన పాట కోసం మరో సాంగ్ నుంచి ట్యూన్స్ కాపీ కొట్టినట్లు ట్రోల్స్ వచ్చాయి.

 క్రాక్ సినిమాలో కాపీ సాంగ్..

క్రాక్ సినిమాలో కాపీ సాంగ్..

రవితేజ నటించిన క్రాక్ సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదట భూమ్ బద్ధల్ అనే సాంగ్ కి మంచి క్రేజ్ దక్కింది. ఇక రెండవ సాంగ్ ను అనిరుధ్ తో పాడించారు. కానీ ఆ సాంగ్ కాపీ క్యాట్ అని తేలిపోయింది. 'బల్లేగా తగిలావే బంగారం' అంటూ అనిరుధ్ రవిచందర్ తో పాడించిన ఆ పాటకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ విడుదలైన కొన్ని గంటలకే కాపీ క్యాట్ ఆరోపణలు మొదలయ్యాయి. ఆ సాంగ్ (selva el neon) సెల్వ ఎల్ నియోన్' అనే పాట నుంచి ట్యూన్స్ కాపీ చేసినట్లుగా ట్రోల్స్ వచ్చాయి

 క్లారిటీ ఇచ్చిన థమన్..

క్లారిటీ ఇచ్చిన థమన్..


ఇక ఫైనల్ గా థమన్ ఆ ఆరోపణలపై స్పందిస్తూ.. కాపీ విమర్శలు నేను అస్సలు పట్టించుకోను. ఒకవేళ కాపీ.కొట్టినట్లు తెలిస్తే నా టీమ్ లో ఎవరో ఒకరు కనుక్కోలేరా? అంటూ థమన్ ప్రశ్నించాడు. ఇక ఇప్పటివరకు వందకు పైగా సినిమాలకు పని చేసిన నేను స్టార్ హీరోలతో అగ్ర దర్శకులతో కూడా పనిచేశానని అంటూ ఇంతమందిలో ఎవరో ఒకరు కనుక్కోరా అని కౌంటర్ కూడా ఇచ్చాడు.

కేసులు ఎందుకు పెట్టలేదు

కేసులు ఎందుకు పెట్టలేదు

సంగీత పరిజ్ఞానం లేని వాళ్లే సోషల్ మీడియాలో అనవసర కామెంట్స్ చేస్తుంటారని చెప్పిన థమన్ వాటిని తాను ఎక్కువగా పట్టించుకోనని కూడా చెప్పాడు. ఒకవేళ నేను నిజంగా కాపీ కొడితే ఏ కంపెనీ కూడా కేసులు ఎందుకు పెట్టలేదు. దాని అర్థం ఏంటి అంటూ విమర్శలు ట్రోలింగ్స్ అర్థం లేనివని థమన్ కొట్టిపారేశారు. ఆరోపణలను పట్టించుకుంటే ముందుకు సాగలేము అంటూ మంచి మ్యూజిక్ తో ముందుకు సాగడమే తన పని అని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X