మెల్లగా రెమ్యునరేషన్ డోస్ పెంచుతున్న థమన్.. ఒకేసారి 8 సినిమాలంటే.. హీరోల రేంజ్‌లో ఆదాయం

సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు అనేవి ఎప్పుడు ఏ రూపం నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ఒక్కసారి క్లిక్కయితే చాలు.. కొత్తగా ట్రై చేస్తున్నంత వరకు కూడా ఛాన్సులు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం థమన్ కూడా అదే తరహాలో ఛాన్సులు అందుకుంటున్నాడు. ఇప్పుడు థమన్ ఉన్నంత బిజీగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత బిజీగా లేడేమో అనిపిస్తోంది. వరుస హిట్స్ రావడంతో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు టాక్ వస్తోంది.

అంత సాధారణమైన విషయం కాదు

అంత సాధారణమైన విషయం కాదు

మ్యూజిక్ డైరెక్టర్ గా క్లిక్కవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కొన్నిసార్లు ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన సాంగ్స్ కూడా జనాలకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ అందించడం పెద్ద టాస్క్. కానీ థమన్ ఆ విషయంలో ఒక నార్మల్ మాస్ అడియెన్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేస్తుంటాడు.

దేవి శ్రీ ప్రసాద్ కు పోటీగా

దేవి శ్రీ ప్రసాద్ కు పోటీగా

రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేయడంలో కూడా అతని స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ కు సరైన పోటీగా నిలుస్తున్న థమన్ వరుసగా ఛాన్సులు అందుకుంటున్నాడు. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమాతో థమన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకు త్రివిక్రమ్ కూడా ఒక కారణం అని థమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

సినిమా కథ నచ్చితే..

సినిమా కథ నచ్చితే..

ఇక క్రాక్, వకీల్ సాబ్ లాంటి హిట్స్ అందుకోవడంతో థమన్ కు మరిన్ని పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. అలాగే సినిమా బడ్జెట్ ను బట్టి కూడా అవసరం అయితే థమన్ తక్కువ పారితోషికం కూడా తీసుకుంటాడట. ఆ విషయంలో సినిమా కథ బాగా ఇంప్రెస్ చేస్తేనే తక్కువ తీసుకుంటాడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.

ఆ సినిమాల విజయంతో..

ఆ సినిమాల విజయంతో..

ఇక అల వైకుంఠపురములో సినిమా ముందు వరకు కూడా కోటి కంటే తక్కువ అందుకున్న థమన్ ఆ సినిమా అనంతరం ఒక్కసారిగా కోటిన్నరకు వచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో రెమ్యునరేషన్ ను 2కోట్ల మార్క్ ను దాటించినట్లు సమాచారం.

చేతిలో 8 సినిమాలు

చేతిలో 8 సినిమాలు

ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ 3కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇక డిఎస్పీ కంటే థమన్ కె ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం థమన్ చేతిలో 8కి పైగా సినిమాలు ఉన్నాయి. నాని టక్ జగదీష్, బాలయ్య అఖండ విడుదలకు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ లకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

Recommended Video

Krithi Shetty, Vaishav Tej's Uppena Records Highest TRP || Filmibeat Telugu
హీరోల రేంజ్ లోనే ఆదాయం..

హీరోల రేంజ్ లోనే ఆదాయం..

అలాగే అఖిల్ ఏజెంట్, శంకర్ - రామ్ చరణ్ కాంబో, గోపిచంద్ మలినేని - బాలయ్య సినిమాలకు కూడా థమన్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి థమన్ ప్రస్తుత రెమ్యునరేషన్ ను బట్టి ఒక ఏడాదిలోనే హీరోల రేంజ్ లోనే ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X