బ్రహ్మితో పోల్చగానే థమన్ కౌంటర్.. నువ్వు చేసే పనేంటో వెళ్లి నీ పెళ్ళానికి చెప్పుకో అంటూ..
టాలీవుడ్ లో ప్రస్తుతం థమన్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమాకు వర్క్ చేసినా కూడా మినిమమ్ హిట్టయ్యేలా వాయిస్తున్నాడు. అతను ఒప్పుకుంటున్న సినిమాలు కూడా కంటెంట్ పరంగా క్లిక్కవ్వడంతో థమన్ పేరు గట్టిగానే మారుమ్రోగిపోతోంది. అయితే ఇటీవల ఒక మీమ్ చూసిన తమన్ సరదాగా స్పందిస్తూనే కౌంటర్ ఎటాక్ చేసినట్లు అర్ధమవుతోంది.

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
కిక్ సినిమా నుంచి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేశాడు. కేవలం కమర్షియల్ సినిమాలనే కాకుండా హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ అంటూ విభిన్నమైన సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అతని సినిమాలు మ్యూజిక్ పరంగా హిట్టవ్వడంతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టేశాడు.

మ్యూజిక్ పై ట్రోలింగ్స్
అయితే థమన్ ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు అనుకోని విదంగా విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఇతర భాషల్లో క్లిక్కయ్యిన ఇంటర్నేషనల్ సాంగ్స్ ను యధావిధిగా కాపీ కొట్టేయడం అతనికి మైనెస్ అయ్యింది. బిజినెస్ మెన్ సినిమా నుంచి ట్రోలింగ్ డోస్ మరింత ఎక్కువయ్యింది. అయితే కొన్నిసార్లు డైరెక్టర్స్ ఇష్ట ప్రకారం చేయాల్సి వస్తుందని థమన్ క్లారిటీ ఇచ్చాడు.

క్రాక్ సినిమాలో కూడా..
ఇటీవల క్రాక్ సినిమాలో కూడా ఒక సాంగ్ కాపీ కొట్టినట్లు ఉండడంతో అనేక రకాల మీమ్స్ వచ్చాయి. అల.. వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్టదుకోవడమే కాకుండా థమన్ ఒక విధంగా తన గౌరవాన్ని పెంచుకున్నాడు. అల్లు అర్జున్ కూడా ఆ విషయాన్ని స్టేజ్ పైనే చెప్పేశాడు. కానీ ఆ వెంటనే క్రాక్ వల్ల కొంత ట్రోలింగ్స్ తప్పలేదు.

థమన్ కౌంటర్
ఇక ట్రోలింగ్స్ పై పలుమార్లు స్పందించిన థమన్ వాటిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కాపీ కొడితే మా అమ్మ అన్నం పెట్టదు అనే డైలాగ్ అప్పట్లో బాగానే ట్రెండ్ అయ్యింది. ఇక ఈసారి థమన్ మరో మీమ్ పై సరదాగా కామెంట్ చేస్తూనే కౌంటర్ ఇచ్చాడు. ఒక నెటీజన్ కింగ్ సినిమాలోని జయసూర్య ఫొటోలను జతచేసి.. నా పిల్లలకు థమన్ ఇలా ఉంటాడని చెబుతానని అన్నాడు.
Recommended Video

ఇది చేసే ముందు..
అందుకు థమన్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ''ఇది చేసే ముందు ఒకసారి నీ భార్యకు చెప్పు బ్రో ఇలాంటి మీమ్స్ తో బిజీగా ఉన్నాను అని. తప్పకుండా ఆమె ఒక పనికిరాని మీమర్ ను పెళ్లి చేసుకున్నాను అని గర్వ పడుతుంది''.. అంటూ థమన్ నవ్వుతూనే కౌంటర్ ట్వీట్ ఇచ్చాడు. ఇక నెటిజన్లు ఆ పోస్ట్ భిన్నంగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











