twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై బాలయ్యపై ఒసేయ్ రాములమ్మతో కాపీ కామెంట్స్.. ఊహించని సమాధానం ఇచ్చిన థమన్!

    |

    నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించే విధంగా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. మొత్తానికి పెట్టిన పెట్టుబడికి నిర్మాతలు అందరూ కూడా సేఫ్ అయ్యారు. ఇక ఈ సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతం కూడా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే థమన్ మరోసారి తన పవర్ ఏమిటో చూపించాడు.

    అందులో యాక్షన్ సన్నివేశాలకు అలాగే బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయింది. అయితే జై బాలయ్య అనే పాట మాత్రం కాపీ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ అయితే నడిచింది. ముఖ్యంగా విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్ నుంచి కాపీ కొట్టారు అంటూ చాలా రకాల ట్రోల్లింగ్స్ వచ్చాయి.

    Music director thaman about copy comments on jai balayya song

    అయితే గతంలో ఆ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు థమన్ మాత్రం తన వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి ఆ పాట అదే తరహాలో ఉండాలి అనే విధంగానే కంపోజ్ చేసినట్లుగా థమన్ వివరణ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    దర్శకుడు అలాగే నిర్మాతలు అందరం కూడా అదే అనుకున్నాము. ఆ విషయం మాకు తెలియదా?.. ఆ టైంలో అలాంటి తరహాలో పాట ఉండాలి అని అనుకొని చేసిందే.. అంటూ తమన్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కూడా తను వాటిని పట్టించుకోను అని వీలైనంత వరకు డైరెక్టర్ ఏ విధంగా కంటెంట్ అడిగుతే ఆ విధంగా బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు.

    English summary
    Music director thaman about copy comments on jai balayya song
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X