ఇప్పుడు మహేష్ బాబు కోసం కష్టపడుతున్న థమన్.. త్వరలోనే స్పెషల్ అప్డేట్

టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఓ వర్గం ఆడియెన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసింది. ఎందుకంటే ఒకరి తరువాత. మరొకరు బెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొన్నటివరకు దేవిశ్రీప్రసాద్, థమన్ మధ్య పోటీ ఎక్కువగా నడిచింది. ఇక ఇప్పుడు మణిశర్మ కూడా ట్రాక్ లోకి వచ్చారు కాబట్టి పోటీ తీవ్రత మరింత ఎక్కువయ్యింది.

అయితే ఎక్కువగా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నది మాత్రం థమన్ అనే చెప్పాలి. ఈ ఏడాది క్రాక్ సినిమాతో పవర్ఫుల్ మాస్ హిట్టు కొట్టేశాడు. ఇక వకీల్ సాబ్ కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వడంతో థమన్ రేంజ్ మరింత పెరిగింది. నెక్స్ట్ ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రాబోయే పెద్ద సినిమాల్లో మహేష్ సినిమా కూడా ఉంది.

Music director thaman about mahesh babu movie audio

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సర్కారువారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న థమన్ ఇప్పటికే మూడు ట్యూన్లను కూడా రెడీ చేసినట్లు సమాచారం.

అందులో మొత్తం 5పాటలు ఉంటాయట. ఇక 3 పాటలు కూడా రెడీ అవుతున్నట్లు థమన్ ఇంటర్వ్యూలోనే క్లారిటీ ఇచ్చేశాడు. వకీల్ సాబ్ హిట్టవ్వడంతో నెక్స్ట్ ఫోకస్ మొత్తం సర్కారు వారి పాటపై పెట్టినట్లు థమన్ వివరణ ఇచ్చారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ పై కూడా అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X