RRR ఆస్కార్ పై థమన్ షాకింగ్ కామెంట్స్.. మమ్మల్ని త్రివిక్రమ్ తీసుకువెళ్తారు అంటూ..

రాజమౌళి RRR సినిమా ఇటీవల ఆస్కార్ బరిలో కూడా నిలిచి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంది. నాటు నాటు పాట బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నామినేషన్ లో నిలవడం విశేషం. అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదివరకే దర్శకుడి పై అలాగే కీరవాణిపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు ఈ విషయంపై కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

అయితే ఇటీవల థమన్ ఆస్కార్ విషయంలో స్పందించిన విధానంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే కొనసాగుతున్నాయి. గతంలోనే కాపీ సాంగ్స్ ద్వారా హాట్ టాపిక్ గా నిలిచిన థమన్ ఈసారి ఆస్కార్ విషయం గురించి ప్రస్తావించి మరింత చర్చనీయాంశంగా మారుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో థమన్ ను యాంకర్ ఈ విధంగా ప్రశ్నించింది. ఆస్కార్స్ కి రాజమౌళి గారు ఒక మార్గాన్ని వేశారు. మరి మీరు ఎప్పుడు వెళ్లబోతున్నారు అని కూడా అడగడంతో అందుకు థమన్ ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు.

Music director thaman about oscar awards with trivikram path

మమ్మల్ని త్రివిక్రమ్ గారు తీసుకువెళ్తారు అంటూ థమన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇదివరకే కాఫీ సాంగ్స్ అంటూ థమన్ కొన్ని ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ కూడా చాలాసార్లు అలాంటి చేదు అనుభవాలను చూశాడు. ఇక ఇప్పుడు వీరు ఆస్కార్ గురించి స్పందించడంతో సోషల్ మీడియాలో విభిన్నంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు.

కాపీ సాంగ్ నామినేషన్స్ లో థమన్ ఉంటాడు అని మరి కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై థమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వరుసగా సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం వీరి కలయికలో మహేష్ బాబు 28వ ప్రాజెక్ట్ తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X