SVP: మహేష్ దున్నేయడం కాయం.. సర్కారు వారి సందడి మొదలయ్యేది అప్పటి నుంచే: థమన్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది నుంచి పెద్ద సినిమాలు కూడా వరుసగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. కొంతమంది అందరి కంటే ముందుగానే విడుదల తేదీల పై క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా అనుకోని కారణాల వలన సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి మహేష్ బాబు కూడా సంక్రాంతి పోటీలో నిలువలేక సినిమాలను వాయిదా వేసుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత మహేష్ బాబు గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి కలుస్తున్న ఈ కాంబినేషన్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ విషయంలో ఇటీవల సంగీత దర్శకుడు తమన్ ఒక క్లారిటీ ఇచ్చాడు. అసలైతే ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఆ సమయంలో RRR సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇక ఈ పోటీలో ఎలాంటి సినిమా వచ్చినా కూడా ఎంతో కొంత నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోటీలో సర్కారు వారి పాట సినిమా గట్టిపోటీని ఇస్తుందని తెలిసినప్పటికీ కూడా నిర్మాతలు అలాగే మహేష్ బాబు కూడా పోటీ చేయవద్దు అని సినిమాను వచ్చే సమ్మర్ కి వాయిదా వేశారు.

Music director thaman about svp movie regular promotions

అయితే విడుదల తేదీ ని బట్టి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సంగీత దర్శకుడు తమన్ మరొకసారి క్లారిటీ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన అన్ని పాటలు కూడా దాదాపు రెడీ అయ్యాయి. సినిమాను ఏప్రిల్ లో విడుదల చేస్తే జనవరి నుంచి పాటలను విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చాడు. జనవరి నుంచి మొదలు పెడితే ఏప్రిల్ వరకు సర్కారు వారి పాట నాన్ స్టాప్ హడావిడి ఉంటుందని మహేష్ బాబు దున్నేయడం ఖాయమని కూడా తమన్ వివరణ ఇచ్చాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు అని సర్కారు వారి పాట అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని తెలియజేశాడు.

ఇక సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు ఒక రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మొదట యూఎస్ బ్యాక్ డ్రాప్ లో మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక పల్లెటూరి కి షిఫ్ట్ అవుతుందట.. సినిమాలో బ్యాంక్ మోసాలను అలాగే పేద వారికి సంబంధించిన ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ ను చూపించబోతున్నారు. దర్శకుడు పరశురామ్ ఇంతవరకు ఇలాంటి స్టోరీలు అయితే టచ్ చేయలేదు.. గీత గోవిందం సినిమా తో మంచి ఫామ్ లో ఉన్న పరశురామ్ ఈ సినిమాతో ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X