Don't Miss!
- News లోక్‌సభ ఎన్నికల తర్వాత గందరగోళమే: ఉద్యమ కేసీఆర్‌ను చూస్తారంటూ బీఆర్ఎస్ అధినేత
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వకీల్ సాబ్‌లో ఐటెమ్ సాంగ్ కావాలి అనగానే షాక్ అయ్యా: థమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఒక్క నైట్ లోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే పవన్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమా మరో స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ గురించి మాట్లాడారు.
మొదటి పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వకీల్ సాబ్ కోసం అందించింది మూడు పాటలే అయినా కూడా ఆ సాంగ్స్ భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మగువ మగువ సాంగ్ ఫస్ట్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఎంతగానో ట్రెండ్ అయ్యింది. ఇక మహిళలకు సంబంధించిన ఈవెంట్స్ లలో కూడా ఆ పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.
ప్రమోషన్స్ లో బిజీగా థమన్
థమన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. పెద్ద సినిమాలకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అతను చాలా బిజీగా ఉన్నప్పటికీ వకీల్ సాబ్ ప్రమోషన్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. రెగ్యులర్ ఈవెంట్స్ లలో కూడా సందడి చేస్తున్నాడు.
ఐటెమ్ సాంగ్ సాంగ్ కావాలని..
అయితే వకీల్ సాబ్ లో పవన్ అభిమానులకు నచ్చే విధంగా సత్యమేవజయతే పాటను థమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఐటెమ్ సాంగ్స్ చేయాలని చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని థమన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి సినిమాలో ఐటెమ్ సాంగ్ ఎలా అడుగుతున్నారో అర్థం కావడం లేదని నవ్వుకున్నట్లు చెప్పాడు.
హై వోల్టేజ్ సీన్స్..
ఇక వకీల్ సాబ్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా డిజైన్ చేసినట్లు చెప్పారు. ప్రతి పది నిమిషాలకు పవన్ అభిమానులకు నచ్చే విదంగా సినిమాలో హై వోల్టేజ్ సీన్స్ ఉంటాయని థమన్ వివరణ ఇచ్చారు. ఇక సినిమాకు మొదట మగువ మగువ అనే టైటిల్ కూడా అనుకున్నట్లు చెబుతూ.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్లు ఉండాలని వకీల్ సాబ్ ను ఫిక్స్ చేసినట్లు వివరణ ఇచ్చారు.