థమన్, పవర్ స్టార్ మరోసారి.. అంతా వకీల్ సాబ్ వల్లే..

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో థమన్ సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తోంది. ఈ ఏడాది క్రాక్ సినిమాతో మొదలైన తమన్ హవా అలానే కంటిన్యూ అవుతోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా కథకు తగ్గట్లుగా మ్యూజిక్ బాధేస్తున్నాడు.

పైగా స్టార్ హీరోలను కూడా దృష్టిలో పెట్టుకొని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆదరగొట్టేస్తున్నాడు. ఇక వకీల్ సాబ్ తో తమన్ సత్తా ఏమిటో మరోసారి ఋజువయ్యింది. ఇక అతని చేతుల్లో ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి BB3, మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి సినిమాలకు కూడా డిఫెరెంట్ మ్యూజిక్ రెడీ చేస్తున్నాడు.

Music director thaman another movie with pawan kalyan

ఇక పవర్ స్టార్ తో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ మ్యూజిక్ పై పవన్ చాలా పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాకు కూడా థమన్ ను ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి థమన్ ఆ సినిమాతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X