అమ్మ అన్నం పెడుతుందా.. మీమ్స్ పై మొదటి సారి స్పందించిన థమన్.. అదిరిపోయే కౌంటర్!

సోషల్ మీడియా వరల్డ్ లో సెలబ్రెటీలపై ట్రోల్స్ రావడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఇక సరదాగా ఉండే మీమ్స్ కూడా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలని కొంతమంది సరదాగా తీసుకుంటే మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ మీమ్స్ పై స్పందించాడు. అమ్మ అన్నం పెడుతుందా మీమ్స్ పై కౌంటట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఆ డోస్ మాత్రం తగ్గడం లేదు

ఆ డోస్ మాత్రం తగ్గడం లేదు

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సినిమాలకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్న థమన్ అప్పుడప్పుడు కొన్ని కాపీ సాంగ్స్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నిసార్లు వాటిపై క్లారిటీ ఇచ్చినా కూడా ట్రోలింగ్స్ డోస్ మాత్రం తగ్గడం లేదు. దర్శకుల సలహా మేరకు కొన్ని సాంగ్స్ ను అలా కంపోజ్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అమ్మ నాకు అన్నం పెట్టదు

అమ్మ నాకు అన్నం పెట్టదు

ఒకసారి ఈ విషయంలో థమన్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను సాంగ్స్ కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెట్టదు అంటూ డిఫరెంట్ గా వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పదే పదే ఆ డైలాగ్ ను వాడేస్తూ థమన్ ను ట్రోల్ చేశారు.

అదిరిపోయే కౌంటర్

అదిరిపోయే కౌంటర్

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి స్పందించిన థమన్ అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు. మీమ్స్ చేసే వాళ్లకు ముందు వాళ్ళు చేసే పనికి వాళ్ళ అమ్మ అన్నం పెడుతుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆ తరువాత మా అమ్మ నాకు అన్నం పెడుతుందా లేదా అనే విషయంపై మాట్లాడాలి అంటూ కౌంటర్ ఇచ్చారు.

రాబోతున్న సినిమాలు

రాబోతున్న సినిమాలు

ఇక ప్రస్తుతం థమన్ వకీల్ సాబ్ సినిమాతో పవర్ఫుల్ గా రెడీ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సాంగ్స్ ద్వారా కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే వైల్డ్ డాగ్ సినిమాకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం BB3, సర్కారు వారి పాట, టక్ జగదీష్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ తమిళ్ లో కూడా మరికొన్ని సినిమాలకు వర్క్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X