twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖండ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ డోస్ పెంచిన థమన్?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మార్కెట్ స్థాయి ఒక్కసారిగా పెరుగుతుండడంతో రెమ్యునరేషన్ డోస్ కూడా గట్టిగానే పెరుగుతోంది. టెక్నీషియన్స్ ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తరహాలో అడుగులు వేస్తున్నారు. ఇక అఖండ సినిమా ప్రభావంతో సంగీత దర్శకుడు థమన్ కూడా పారితోషికం గట్టిగానే పెంచబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వస్తోంది. ప్రస్తుతం థమన్ చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే కావడంతో ఈ టైమ్ ను ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    Recommended Video

    Akhanda Review : Balakrishna Man Of Masses For Decades | Jai Balayya || Filmibeat Telugu
    క్రాక్ సినిమాతో..

    క్రాక్ సినిమాతో..


    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో థమన్ ఒకరు. దేవి శ్రీ ప్రసాద్ గట్టిగానే పోటీని ఇస్తున్నప్పట్టికి థమన్ డామినేషన్ అయితే మామూలుగా లేదు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో మొదట్లోనే సాలీడ్ బాక్సాఫీస్ హిట్ కొట్టేలా చేసిన థమన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా అనంతరం చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా థమన్ వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

    నెగిటివ్ కామెంట్స్ ను లెక్క చేయకుండా..

    నెగిటివ్ కామెంట్స్ ను లెక్క చేయకుండా..


    గతంలో థమన్ కొంతమంది నిర్మాతల దర్శకుల ఒత్తిడి కారణంగా టెంప్ట్ అయ్యి నచ్చని సినిమాలు కూడా చేశాడు. ఇక ఆ సినిమాలు ప్లాప్ కావడం వలన థమన్ స్థాయి కూడా కొంత తగ్గింది. మధ్యలో కొన్ని కాపీ సాంగ్స్ అని కూడా విమర్శలు వచ్చాయి. కానీ థమన్ ఆ కామెంట్స్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.

     అఖండ కోసం హార్డ్ వర్క్

    అఖండ కోసం హార్డ్ వర్క్

    ముందు కథ నచ్చితేనే ఒకే చేస్తానని థమన్ చాలా బలమైన కమిట్మెంట్ తో ముందుకు వెళుతున్నాడు. అఖండ సినిమా కోసం కూడా థమన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. కేవలం ఒక్క పాట కోసమే నెలరోజులు కష్టపడ్డాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అఖండ టైటిల్ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా చాలా కష్టపడ్డారట.

     రెమ్యునరేషన్ డోస్ పెంచిన థమన్

    రెమ్యునరేషన్ డోస్ పెంచిన థమన్


    ఇక ప్రస్తుతం థమన్ కు మళ్ళీ ఆఫర్స్ డోస్ కూడా గట్టిగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక భీమ్లా నాయక్ కూడా హిట్టు బొమ్మే కాబట్టి థమన్ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం థమన్ 2.5కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇక తరువాత రాబోయే సినిమాలకు మాత్రం 3కోట్లకు పైగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    ప్రస్తుతం పెద్ద సినిమాలతో బిజీగా..

    ప్రస్తుతం పెద్ద సినిమాలతో బిజీగా..


    భీమ్లా నాయక్ తో పాటు థమన్ చేతిలో శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట కంపోజింగ్ కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది. అలాగే మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి, విజయ్ సినిమాతో పాటు త్వరలోనే మరో రెండు తమిళ్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాలకు థమన్ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    Music director thaman hiked his remuneration after akhanda hit,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X