ప్రతీ గొట్టం గాడికి జవాబు చెప్పాలా? గుంటూరు కారం వివాదంపై తమన్ ఘాటైన వ్యాఖ్యలు
తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిలో బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. అగ్ర హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ బ్రో, మహేష్ బాబుతో గుంటూరు కారం, బాలకృష్ణతో భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్, రవితేజ సినిమాలతో బిజీగా బిజీగా ఉన్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా నుంచి తీసివేశారని, గుంటూరు కారం సినిమా ఆగిపోయిందంటూ తప్పుడు వార్తలు రాసిన వారిపై తమన్ బిజీగా మారిపోయారు. గుంటూరు కారం సినిమా గురించిన వివాదం వివరాల్లోకి వెళితే..
సినిమా ఏం అడుగుతుందో అంత వరకే మ్యూజిక్ చేయాలి. నేను డిసైడ్ చేయడానికి ఏమీ ఉండదు. నేను కంపోజ్ చేసిన పాట నచ్చకపోతే.. పది ట్యూన్స్ ఇస్తాను. అంతకంటే నేను ఏమీ చేయలేను. వకీల్ సాబ్ కథను బట్టి మగువ మగువ సాంగ్ చేయాలి.. భీమ్లా నాయక్ సినిమాకు లల్లా.. భీమ్లా అనే పాటను చేయాలి. బ్రో సినిమాకు తగినట్టు పాటలు చేశాం. ఫస్ట్ పాట రిలీజ్ తర్వాత కొందరు మెచ్చుకొన్నారు. కొందరు బాగాలేదన్నారు. కొందరు తిడుతున్నారు అని తమన్ చెప్పారు.

ఇక గుంటూరు కారం సినిమాకు సంబంధించిన స్క్రిప్టు మార్పులు జరుగుతున్నాయి. బయట ఏదో ఏదో ప్రచారం జరుగుతున్నది. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నన్ను తీసేశారని బయటకు వచ్చిన వార్తలో నిజం లేదు. అలాంటిదేమైనా ఉంటే నిర్మాత అధికారికంగా చెప్పేస్తారు కదా. ప్రతీ గొట్టం గాడికి నేను సమాధానం చెప్పాలా? అని తమన్ అన్నారు.
ప్రతీ ఒక్కడు గుంటూరు కారం సినిమాపై పడ్డారు. బయటకు వచ్చిన రూమర్లకు కారణం తెలియదు. ఎవరికీ ఫ్లాప్ సినిమా తీయాలని ఉండదు. ఓ సినిమాను పట్టి పట్టి టార్గెట్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. వాటిని వదిలేసి గుంటూరు కారం సినిమాపై ఎందుకు పడ్డారో తెలియదు. గుంటూరు కారం సినిమా టైటిల్ ఆ మూవీకి యాప్ట్. మాస్ టైటిల్ అని తమన్ అన్నారు.
సినిమాకు మ్యూజిక్ చేయడమనేది ఈ రోజుల్లో చాలా ఒత్తిడితో కూడుకొన్న పని. నా ప్లేస్‌లో ఎవరైనా ఉంటే పారిపోయేవాళ్లు. లేదా మెదడు చిట్లి చనిపోయేవారు. లేదా గుండెపోటు వచ్చేదేమో. కానీ తొమ్మిదేళ్ల కష్టపడిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు బ్రేక్ వచ్చింది. 2012లో ఒకే సంవత్సరం 12 సినిమాలు చేశాను. ప్రతీ స్టేజ్‌లో మేనేజ్ చేయడం నాకు తెలుసు. ఏ నిర్మాతకు ఎప్పుడు మ్యూజిక్ అందించాలనే ప్లాన్ నాకు ఉంటుంది అని తమన్ అన్నారు.

సినిమాకు మ్యూజిక్ అనేది మారిపోయింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాదు. టీజర్, ట్రైలర్స్‌కు కూడా మ్యూజిక్ చేయాల్సి ఉంటుంది. రకరకాల పనులు ఉంటున్నాయి. ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి. ప్యాన్ ఇండియా మూవీస్‌కు మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంటుంది. రేంజ్‌ను బాధ్యతలు మరింతగా పెరిగిపోతాయి. తెలుగు కంటే ఒక రకంగా ఇవ్వాలి.. హిందీ అయితే మరో రకంగా ఉండాలి అని తమన్ పేర్కొన్నారు.
నిర్మాతగా మారాలని ఉంది. కానీ ఇప్పడే కాదు. మంచి టీమ్ ఉండాలి. నమ్మకమైన వ్యక్తులు దొరకాలి. మా తాత గారు నిర్మాత. ఆయన స్థాపించిన ప్రతిభా ఫిలింస్ బ్యానర్‌ను రిజిస్టర్ చేయించాను. భవిష్యత్‌లో మంచి సినిమాలను నిర్మిస్తాను. అయితే నిర్మాతగా మారడానికి ఇంకా సమయం ఉంది అని తమన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











