గుంటూరు కారం కోసం థమన్ గట్టిగానే వసూలు చేస్తున్నాడుగా.. ఎంత ఇస్తున్నారంటే?
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు అన్ని కూడా వీరిద్దరే ఎక్కువగా చేస్తున్నారు. అయితే దేవిశ్రీప్రసాద్ మాత్రం సెలక్టివ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తమన్ ఏడాదికి పది సినిమాల వరకు చేస్తున్నాడు.
గత ఏడాది తొమ్మిది సినిమాల వరకు తమన్ చేశాడు. అందులో చాలా వరకు కమర్షియల్ హిట్స్ కావడం విశేషం. ఇక ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు అతను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

మినిమమ్ రేంజ్ సినిమాలు: ఈ ఏడాది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు మినిమమ్ రేంజ్ సినిమాలు తమన్ చేతిలో డజను వరకు ఉన్నాయి. ఇప్పటికే వారుసు, వీరసింహారెడ్డి సినిమాలు తమన్ నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. దీని తర్వాత రామ్ పోతినేని, బోయపాటి మూవీ పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నాడు. బాలయ్యతో భగవంత్ కేసరి ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది.

గుంటూరు కారం సినిమా: అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ కూడా సెట్స్ పైన ఉంది. టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఇప్పుడు టాప్ లోకి తమన్ వచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా కోసం తమన్ కి ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారంట. ఈ స్థాయిలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి ఇండియన్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఎఆర్ రెహమాన్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
అంత ఎందుకు ఇస్తున్నారంటే: ఎంఎం కీరవాణి కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా అతను సెలక్టివ్ గా రాజమౌళి సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే వరుసగా సక్సెస్ ఫుల్ ఆల్బమ్స్ అందిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ రూమర్స్ లో నిజం లేదు: ఇక ఇటీవల థమన్ ను ఈ సినిమా నుంచి తీసేస్తున్నట్లుగా అనేక రకాల రూమర్స్ అయితే వినిపించాయి. ఆ స్థానంలో త్రివిక్రమ్ మహేష్ బాబు ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అని అతనికి బదులుగా జీవి ప్రకాష్ కుమార్ ను సెలెక్ట్ చేసుకుని ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపించింది.
ఇక అందులో ఎలాంటి నిజం లేదు అని ఈ ఉదయమే చిత్ర నిర్మాతల నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని ట్యూన్స్ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా మిగతా ట్యూన్స్ అన్నిటిని కూడా గుంటూరు కారం సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











