BRO: ముఖ్యమైన వర్క్ చేస్తున్న థమన్.. పవన్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమానే 'బ్రో (BRO)'. ఇద్దరు మెగా హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో అంచనాలను కూడా ఓ రేంజ్‌లో ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న 'బ్రో (BRO)' మూవీని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'వినోదయ సీతమ్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపుగా కంప్లీట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతూ వస్తోంది. అదే సమయంలో ఈ మూవీ నుంచి వరుసగా అప్‌డేట్లను ఇస్తున్నారు.

Music Director Thaman Starts BRO Movie BGM Work

'బ్రో (BRO)' మూవీని జూలై 28న రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను ఎంతో వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌పై వర్క్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో చాలా మంది టెక్నీషియన్లు వయోలిన్ వాయిస్తూ కనిపించారు. ఇక, దీనికి 'BROBGM' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ బ్యాగ్రౌండ్ స్కోర్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే 'బ్రో (BRO)' మూవీ నుంచి ఒక పాట విడుదలైంది. అలాగే, టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈరోజు ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను వదలబోతున్నారు. ఇలా వరుస అప్‌డేట్లతో మెగా ఫ్యాన్స్‌ను చిత్ర యూనిట్ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు థమన్ చేసిన ట్వీట్‌తో వాళ్లలో జోష్ రెట్టింపు అయిందనే చెప్పాలి.

మెగా హీరోల మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బ్రో (BRO)' మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X