AR Rahman Musical Concert రెహ్మాన్ మ్యూజిక్ షోలో తొక్కిసలాట.. 50000 టికెట్ కొన్నప్పటికి దారుణంగా!

మ్యాజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరి రసాభసాగా మారింది. చెన్నైలోని పనియూర్‌లోని ఆదిత్యా రామ్ ప్యాలెస్‌లో ఏఆర్ రెహ్మాన్ నిర్వహించిన మ్యూజికల్ నైట్‌లో సంగీత ప్రియులు, ఆయన అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. నిర్వాహకుల తప్పిదం, అవగాహన లోపంతో ఓ దశలో తొక్కిసలాట జరిగి ఏదైనా విపత్తు జరుగబోతుందా? అనే భయం సంగీత అభిమానుల్లో నెలకొన్నది.ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఏఆర్ రెహ్మాన్ మ్యూజికల్ నైట్‌కు భారీగా మ్యూజిక్ లవర్ పొటేత్తారు. లెక్క పత్రం లేకుండా టికెట్ల అమ్మకాలు జరపడంతో పరిమితికి మంచి సంగీత ప్రియులు హాజరయ్యారు. అది కాకుండా టికెట్ల రేట్ల ప్రకారం కాకుండా అన్ని రకాల టికెట్లు తీసుకొన్న ఔత్సాహికులందరినీ ఒకే చోటకు పంపడంతో గందరగోళం నెలకొన్నది. లోపల ఎంత మంది ఉన్నారో బయట టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్లలేని వారు అంత మంది ఉన్నారు అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Music lovers faces bizarre experience at AR Rahman Musical Concert in Chennai

రెహ్మాన్ మ్యూజికల్ నైట్ కోసం వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నవారిని లోపలికి వెళ్లనీయకపోవడంతో సంగీత ప్రియులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వేదిక వద్ద జరిగిన తోపులాటలో మహిళలు, చిన్న పిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆర్గనైజర్ డబ్బుకు ఆశపడి పరిమితికి మించి టికెట్లు అమ్మారు. దాని ఫలితమే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

రెహ్మాన్ మ్యూజికల్ నైట్ నిర్వహించే వేదిక వద్ద లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రాంగణం వద్దే టికెట్లు చించిపడేశారు. ఇలాంటి పరిస్థితికి కారణం స్థానిక టెలివిజన్ ఛానెల్. వాళ్ల దురాశ ఫలితంగానే డబ్బు, సమయం వృధా అయింది. ఇక ఇదిలా ఉంటే.. వందల కిలోమీటర్ల దూరం నుంచి వాహనాల్లో వచ్చిన వారికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో నానాయాతలు పడ్డారు. వేదికకు2 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Music lovers faces bizarre experience at AR Rahman Musical Concert in Chennai

రెహ్మాన్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు వెళ్లలేకపోయినందుకు ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో తన బాధను వెళ్లగక్కారు. మేము వీఐపీ జోన్ టికెట్లను 25 వేల రూపాయలు, 50 వేల రూపాయలు పెట్టి కొన్నాం. అక్కడ కనీసం సెక్యురిటీ, టికెట్‌ను బట్టి కేటగిరిలు లేవు అని పోస్టు పెట్టారు. తొక్కిసలాట జరిగితే మేనేజ్ చేసేందుకు ఒక్కరు కనిపించలేదు అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X