నాకు వాటా ఇవ్వాల్సిందే... సింగర్లకు ఇళయరాజా వార్నింగ్

Recommended Video

Music Maestro Ilayaraja Threatening Singers | Filmibeat Telugu

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా మరోసారి సింగర్లకు వార్నింగ్ ఇచ్చారు. మ్యూజిక్ కాన్సెర్టుల్లో తన పాటలు పాడాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలని, అందుకు తగిన రాయల్టీ కూడా తనకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.

ఎవరైనా తన పర్మిషన్ లేకుండా, రాయల్టీ చెల్లించకుండా తాను కంపోజ్ చేసిన పాటలు పాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.

అలా అయితే వాటా ఇవ్వాల్సిందే

అలా అయితే వాటా ఇవ్వాల్సిందే

సింగర్లు తన పాటలు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఏదైనా కార్యక్రమంలో ఉచితంగా పాడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే నా పాటలు పాడి వారు సంపాదిస్తున్నపుడు... నాకు రావాల్సిన వాటా నాకు చెల్లించాల్సిందే అన్నారు.

వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను

వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను

నేను కంపోజ్ చేసిన పాటలపై రాయల్టీ కలెక్ట్ చేయాల్సిన పవర్ ఆఫ్ అటర్నీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ మ్యూజీషియన్స్ అసోసియేషన్‌కు ఇచ్చాను. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.

 ఇళయరాజాకు ఆ హక్కు లేదంటున్న నిర్మాతలు

ఇళయరాజాకు ఆ హక్కు లేదంటున్న నిర్మాతలు

అయితే ఇళయరాజా వాదనతో నిర్మాతలు ఏకీభవించడం లేదు. ఏదైనా సినిమాకు ఇళయరాజా పని చేసినపుడు అతడు కంపోజ్ చేసిన సంగీతం హక్కులు కేవలం నిర్మాతకు మాత్రమే చెల్లుతాయని వారు వాదిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చడానికి, స్టూడియోకు, రికార్డింగుకు, సింగర్లకు అందరికీ నిర్మాతే డబ్బు చెల్లిస్తాడు. చివరకు ఇళయరాజా కూడా తాను కంపోజ్ చేసినందుకు నిర్మాత నుంచి డబ్బు తీసుకుంటాడు. మీరేమీ ఫ్రీగా చేయడం లేదు కదా. అందుకే ఈ హక్కులు నిర్మాతలకే దక్కుతాయి... అని నిర్మాత సెల్వం వ్యాఖ్యానించారు.

 కాపీ రైట్స్ చట్టం ప్రకారం...

కాపీ రైట్స్ చట్టం ప్రకారం...

మరో నిర్మాత మాట్లాడుతూ... ఇళయరాజా సర్ కేవలం ఆయన కోర్టు నుంచి తను కంపోజ్ చేసిన మ్యూజిక్ తన పర్మిషన్ లేకుండా పాడొద్దు అని కేవలం కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఇంటర్మ్ ఇంజెక్షన్ మాత్రమే తెచ్చుకున్నారు. కోర్టు తీర్పు రావాల్సి ఉంది. కాపీరైట్ చట్ట ప్రకారం 50 శాతం షేర్ నిర్మాతకు తక్కుతుంది. మిగతాది కంపోజర్, సింగర్, లిరిసిస్టులు షేర్ చేసుకోవాలి' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X