అల్లు అర్జున్ 19.. త్రివిక్రమ్, సిరివెన్నెల, తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం బన్నీ ఫాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. అల్లు అర్జున్ తదుపరి చిత్రంతో ఎలాగైనా మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. ఆలస్యమైనా అన్నీ పక్కాగా కుదిరేవరకు నెక్స్ట్ మూవీని ప్రారంభించడం లేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి ప్రకటన జరిగి చాలా కాలం అవుతోంది. ఏప్రిల్ 24 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఇన్నిరోజులు స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా గడిపిన త్రివిక్రమ్ తాజాగా రంగంలోకి దిగిపోయాడు. సంగీత దర్శకుడు తమన్, దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెలతో కలసి అల్లు అర్జున్ 19వ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ.. సిరివెన్నెల, త్రివిక్రమ్ తో దిగిన ఫోటోని షేర్ చేశారు.

త్రివిక్రమ్ చివరి చిత్రం అరవింద సమేతకు కూడా తమనే సంగీత దర్శకుడు. హారిక అండ్ హాసిని, గీత ఆర్ట్స్ బ్యానర్స్ లో రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే రెండవసారి నటిస్తోంది. త్రివిక్రమ్ ఈ చిత్రం కోసం తండ్రి సెంటిమెంట్ తో కథ సిద్ధం చేశాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











