తౌబా తౌబా పాటపై దుమ్మురేపిన ముత్తయ్య మురళీధరన్.. వికీ కౌశల్ కంటే బెటర్ అంటూ!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూత్‌నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్న పాట తౌబా తౌబా. త్రిప్తి డిమ్రి, వికీ కౌశల్, అమీ విర్క్ నటించిన ఈ సినిమాలోని పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. సోషల్ మీడియాలోని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్లలో ట్రెండింగ్‌గా మారిన ఈ పాటను రీల్స్‌ చేసి దుమ్మరేపుతున్నారు. అయితే ఈ పాటతో కేవలం సగటు ప్రేక్షకులనే కాకుండా సినీ తారలు, ఇన్ల్ఫూ యెన్సర్లు దుమ్ము రేపుతున్నారు. తాజాగా లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బ్యాడ్ న్యూజ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలోని తౌబా తౌబా రిలీజ్ అయిన వెంటనే అనూహ్యమైన స్పందన లభించింది. ఈ పాట తెచ్చిన క్రేజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తొలి వీకెండ్‌ యూత్‌ నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది.

Muttiah Muralitharan stunning performance on Tauba Tauba Song of Tripti Dimri s Bad Newz

తాజాగా తౌబా తౌబా పాట హిట్ కావడంతో యూత్ ఆ పాటను రీల్స్‌గా మలిచి స్పెప్పులతో ఇరుగదీస్తున్నారు. ఈ పాటపై చేసిన రీల్స్‌కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈ పాట ప్రేక్షకులను, సంగీత ప్రియులను వెంటాడుతూనే ఉంది. తెలుగులో సినీ సెలబ్రిటీలు కూడా ఈ పాటపై రీల్స్ చేసి ట్రెండింగ్‌లోకి వచ్చారు.

ఇదిలా ఉండగా.. లెజెండరీ క్రికెటర్, శ్రీలంక ఆటగాడు.. ఓ డ్యాన్స్‌ ఫ్లోర్‌పై ధమాకా చూపించారు. ఈ పాటపై సంగీతానికి లయబద్దంగా డ్యాన్స్ స్టెప్పులతో కేకపెట్టించారు. ఆయన వేసిన స్టెప్పులను చూస్తే ప్రొఫెషనల్ డ్యాన్సర్ కంటే బెటర్‌గా కనిపించారు. అంతేకాకుండా ఆయన వేసిన స్టెప్పులకు అభిమానులు వికీ కౌశల్ కంటే నీవే బెటర్‌గా చేశావని కితాబిస్తున్నారు.

ఇదిలా ఉండగా, బ్యాడ్ న్యూజ్ సినిమా గత 12 రోజులుగా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇండియాలో 64 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X