వీడియో సాంగ్స్‌తో హైప్.. ఉప్పెన టీం ప్రమోషన్స్ మామూలుగా లేదు!

ఉప్పెన సినిమాకు ఇప్పుడున్నంత హైప్ మరే చిత్రానికి లేదు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోన్న సినిమాల్లో ఉప్పెనదే టాప్ ప్లేస్. అంచనాలు మించేలా ఉన్న ఉప్పెన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని కూడా సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేశాయి. మరీ ముఖ్యంగా ఉప్పెన ఆడియో మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. లిరికల్ వీడియోలో ఉన్న విజువల్స్ చూసే సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీడియో సాంగ్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. తాజాగా వీటిని మైత్రీ మూవీస్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇక ఈ వీడియో సాంగ్‌లు నిమిషం కంటే నిడివి తక్కువగానే ఉన్నా కూడా అంచనాలను పెంచే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ విజువల్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Mythri Movie Releases Glimpse Of uppena Video songs

ఇలా సాంగ్స్, లిరికల్ వీడియోలు, వీడియో సాంగ్‌లతో సినిమా మీద హైప్ పెంచేసింది మైత్రీ మూవీస్. ఫిబ్రవరి 12న రాబోతోన్న ఈ మూవీ కోసం సర్వం సిద్దం చేసేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్‌గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి సినిమా గురించి చెప్పిన మాటలు అందరిలోనూ ఆసక్తిని పెంచేశాయి. దృశ్యకావ్యంలా మారుతుందని పదే పదే చెప్పడంతో అందరిలోనూ సినిమాను చూడాలన్న ఆత్రుత పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X