For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్వచ్ఛమైన ప్రేమకథగా నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా.. భగవద్గీత, బైబిల్ ఖురాన్‌ అంటూ చిత్ర యూనిట్ ఎమోషనల్

  |

  జీవీఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌థ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా.ఈ చిత్రం నుంచి విడుదల చేసిన "నిలదీస్తుందా అంటూ సాగే ఈ విరహ గీతంతో పాటు విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుంచి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2 తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్బంగా

  ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం సక్సెస్‌లొ సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతున్నది. అలాగే మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే విషయాన్ని ఈ మధ్య వచ్చిన సినిమాలు నిరూపించాయి. మంచి కాన్సెప్ట్‌తో ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థలో యూత్‌కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి తెర‌కెక్కించడం జరిగింది.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న మేము డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడాం. థియేటర్స్ కూడా కన్వినెంట్‌గా ఉన్నాయి. అందుకే త్వరలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నాం. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న మా చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి కచ్చితంగా ఇది మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది అని అన్నారు.

  Naa Ventapadutunna Chinnadevadammas Neladeestunda Prema song released

  చిత్ర నిర్మాతలు ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వెంక‌టేశ్వ‌రావు మాట్లాడుతూ..ఇంతకుముందు మేము రిలీజ్ చేసిన టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన పెద్దలు తనికెళ్ల భరణి, జీవాతోపాటు నటించిన నటీనటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని అన్నారు.

  చిత్ర దర్శకుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న మా చిత్రం రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా వస్తున్న మా సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. రావణాసురుడికి తన భార్య మండోదరిపై ఉన్న ప్రేమ, రాముడికి సీతపై ఉన్న ప్రేమ, దశరథుడుకు తన కొడుకు మీద నమ్మకం ఇలా ప్రతి ఒక్కరిది అందమైన ప్రేమ. అలాగే
  భగవద్గీత, బైబిల్ ఖురాన్‌లలో అందమైన, పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథను నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా చాలా కలర్ ఫుల్‌గా ఉంటుంది. నాకు ఇలాంటి మంచి కథకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

  Naa Ventapadutunna Chinnadevadammas Neladeestunda Prema song released

  న‌టీన‌టులు: తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ల భ‌ర‌ణి, క‌ల్ప‌నారెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌రులు
  ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: ముల్లేటి నాగేశ్వ‌రావు
  నిర్మాత‌లు: ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
  క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాటలు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ వందెల‌
  సినిమాటోగ్ర‌ఫి: పీ వంశీ ప్ర‌కాష్‌
  సంగీతం: సందీప్ కుమార్‌
  స్క్రీన్‌ప్లే, పాట‌లు: డాక్ట‌ర్ భ‌వ్య దీప్తి రెడ్డి
  ఎడిట‌ర్‌: నంద‌మూరి హరి
  స్టంట్స్‌: రామ కృష్ణ‌
  కొరియోగ్ర‌ఫి: గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్
  పీఆర్వో: మధు వీఆర్

  English summary
  Naa Ventapadutunna Chinnadevadamma is different love story. This movie unit released the feel good song Neladeestunda Prema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X