లవ్‌స్టోరీ అప్‌డేట్ : ‘ఏయ్ పిల్లా’ ఎప్పుడంటే..?
ఫిదా సినిమాతో అందర్నీ కట్టిపడేశాడు కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. చాలా కాలం తరువాత హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల మళ్లీ తన సత్తా చూపించాడు. సాయి పల్లవి, వరుణ్ తేజ్‌ల కెమిస్ట్రీ, శేఖర్ కమ్ముల స్టైల్ ఆఫ్ టేకింగ్ ఫిదాను బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టింది. అయితే మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈ సారి నాగ చైతన్య-సాయి పల్లవిలతో అద్భుతాన్ని క్రియేట్ చేయబోతోన్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ఓ రేంజ్‌లో రచ్చ చేయగా ఆ మధ్య రిలీజ్ చేసిన ఏయ్ పిల్లా వీడియో ప్రోమో తెగ వైరల్ అయింది. కేవలం ఒక్క 67 సెకన్ల నిడివి ఉన్న వీడియోతో చెప్పకనే చెప్పేశాడు.. ఈ సినిమా ఎలా ఉండోబోతోందో. ఆ వీడియోలో చివర్లో వచ్చే షాట్‌కు ఫిదా కాని వారెవరూ ఉండరు.

సమంత సైతం ఆ షాట్ తన మదిలోనే గుర్తుండిపోతుందని ట్వీట్ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. మెట్రోలో చైతుకు సాయి పల్లవి ముద్దు పెట్టే ఆ ఒక్క షాట్‌తోనే ఏయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ తెగ వైరల్ అయింది. ఏయ్ పిల్లా ఫుల్ సాంగ్ మార్చి 11న సాయంత్రం 4.05గంటలకు రిలీజ్ కానుందని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











