Love Story నుంచి అదిరిపోయే కానుక: హైలైట్ అయిన దాన్నే రిలీజ్ చేసిన యూనిట్
ఆ మధ్య పరాజయాలతో పరంపరతో ఇబ్బందులు పడినా.. 'మజిలీ' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య. అప్పటి నుంచి అతడు వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకునిపోతున్నాడు. ఈ ఉత్సాహంతోనే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇందులో భాగంగానే విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరి' అనే సినిమాను చేశాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆరంభం నుంచే 'లవ్ స్టోరి' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. సెకెండ్ వేవ్ తర్వాత ఇదే రికార్డు స్థాయి బిజినెస్ చేసుకుంది. అందుకు అనుగుణంగా దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక, విడుదలైన సమయంలోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. దీంతో ఎన్నో రికార్డులు కూడా నాగ చైతన్య పేరిట నమోదయ్యాయి.

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'లవ్ స్టోరి' మూవీ విడుదలై శనివారానికి తొమ్మిది రోజులు పూర్తైంది. ఆరంభం నుంచే మంచి కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. వీక్ డేస్‌లో మాత్రం నిరాశ పరిచింది. కానీ, శుక్రవారం నుంచి మళ్లీ పుంజుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఇప్పటికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.91 కోట్లు షేర్‌తో పాటు రూ. 53.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా సెకెండ్ వేవ్ తర్వాత ఎక్కువ గ్రాస్‌ను రాబట్టిన చిత్రంగా ఇది నేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటి వరకూ అక్షయ్ కుమర్ 'బెల్ బాటమ్' పేరిట ఉన్న (రూ. 51.20 కోట్లు) రికార్డు బద్దలైపోయింది.
సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న 'లవ్ స్టోరి' మూవీ నుంచి తాజాగా ఏవో ఏవో కలలే వీడియో సాంగ్ విడుదలైంది. మాంచి డ్యాన్స్ నెంబర్ ఉన్న ఈ పాటకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ వర్షంలో అదిరిపోయే స్టెప్పులతో సందడి చేసేశారు. ఈ కారణంగానే ఇది సినిమాలో హైలైట్ అయింది. ఇప్పుడిదే పాటను చిత్ర యూనిట్ వదిలింది. దీంతో యూట్యూబ్‌లో సైతం దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, భాస్కర భట్ల రాసిన ఈ పాటను జోనితా గాంధీ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చాడు.
యువ సామ్రాట్ నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమే 'లవ్ స్టోరి'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ దీనికి సంగీతం సమకూర్చాడు. సున్నితమైన ప్రేమకథతో ఇది తెరకెక్కింది. ఇక, ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించగా.. శేఖర్ కమ్ముల సంక్లిష్టమైన పాయింట్‌ను చక్కగా తెరకెక్కించాడు.


Click it and Unblock the Notifications











