Varudu Kaavalenu Song: దిగు దిగు దిగు నాగ అంటూ థమన్ రచ్చ.. అదిరిన ప్రోమో

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం దక్కించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'అశ్వద్ధామ'తో హిట్ కొట్టాడు.

సూపర్ హిట్ మూవీ తర్వాత నాగశౌర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో 'వరుడు కావలెను' ఒకటి. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఆ మధ్య ఓ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఆ ప్రకటన తాజాగా వెలువడింది.

Naga Shouryas Varudu Kaavalenu Digu Digu Digu Naaga Song On August 4th

నాగశౌర్య - రితూ వర్మ జంటగా నటిస్తోన్న 'వరుడు కావలెను' సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా అతడు ఈ సినిమాలోని మొదటి పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశాడు. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే మాస్ బీట్‌తో ఇది నడస్తుంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. శ్రేయా గోషల్ ఆలపించింది. ఇక, తాజాగా వచ్చిన ప్రోమోలో రితూ వర్మ మాస్ లుక్‌తో అలరించింది. దీంతో ఈ పాటపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక, ఈ సాంగ్ ఆగస్టు 4వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల కాబోతున్నట్లు కూడా ప్రకటించింది యూనిట్.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'వరుడు కావలెను' సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో నాగశౌర్య ధనికుల అబ్బాయిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియోలో దాన్ని చూపించారు. ఇక, ఈ సినిమాలో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకటన కూడా అతి త్వరలో రానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X