విరాటపర్వం నుంచి మరో అద్భుతమైన సాంగ్.. సాయి పల్లవి, రానా ఎమోషనల్ కెమిస్ట్రీ!

సాయి పల్లవి రానా దగ్గుబాటి ముఖ్యమైన పాత్రలో నటించిన విరాటపర్వం సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో ఒక మంచి ప్రేమ కథ కూడా ఉంది అని ఇదివరకే విడుదలైన సాంగ్స్ టీజర్ తో కూడా క్లారిటీ వచ్చేసింది. రానా దగ్గుపాటి ఈ సినిమాలో నక్సలిజం నాయకుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. మరొకవైపు అతనిపై ఎంతో అభిమానంతో ప్రేమను పెంచుకున్న పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి కనిపించబోతోంది. ఇక వీరి మధ్య జరగబోయే పరిణామాలు ఏమిటి అనేది ఈ సినిమాలో ఒక కథాంశం.

తప్పకుండా విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు టెంప్ట్ అవ్వలేదు. ఇదివరకే విడుదలైన సినిమా లోని ఒక పాట మంచి గుర్తింపుని అందుకుంది. ఇక ఇప్పుడు నగదారిలో అనే మరొక అద్భుతమైన పాట పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ పాట సినిమాలోని మరొక అందమైన అర్థాన్ని తెలియజేస్తోంది.

Nagadaarilo song from virata parvam emotional chemistry between rana and sai pallavi

నిప్పు ఉంది నీరు ఉంది నగదారిలో.. అనే ఈ పాటలో సాయి పల్లవి రానా పాత్రలకు సంబంధించిన భావాన్ని తెలియజేసేలా ఉంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటను ద్యావరి నరేంద్ర రెడ్డి, భరద్వాజ్ పాత్రుడు రచించారు. ఇక విభిన్నమైన తరహాలో ప్రముఖ గాయని వరమ్ ఈ పాటను పాడిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది. పాట అర్ధాలు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఇక 2018 లో నీది నాది ఒకే కథ అనే సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న వేణు ఉడుగుల ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. చూస్తుంటే విరాటపర్వం సినిమాలో ఒక మంచి ఎమోషన్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటి నుంచో విరాటపర్వం సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

రానా దగ్గుబాటి ఎంతో ఇష్టంగా ఈ ప్రాజెక్టు లో నటించడం జరిగింది. అయితే సాయి పల్లవి క్యారెక్టర్ ఆధారంగానే సినిమా మొత్తం ఉంటుంది అని సమాచారం. ఇక ఈ సినిమా ఫైనల్ గా జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ విరాటపర్వం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా అనుకున్న డేట్ కు థియేటర్స్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X