Roar of Kesari: బాలయ్య గర్జిస్తే ఎలా ఉంటుందో చూశారా....? ఈసారి థియేటర్లు బద్దలే!
నందమూరి నటసింహం బాలకృష్ణ థియేటర్లలో గర్జించడానికి సిద్ధం అయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా యూఎస్ లో అక్టోబర్ 18న థియేటర్లోకి రాగా... ఇండియాలో అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ కాగా... ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ అయింది. రోర్ ఆఫ్ కేసరి అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నెట్టింట వైరల్ గా మారింది ఈ బీట్. ఆ వివరాల్లోకి వెళితే....
బాలయ్య ఫ్యాన్స్.. గెట్ రెడి.. సింహం థియేటర్లలో గర్జించడానికి సిద్ధం అయింది. ఇక ప్రతి థియేటర్ వద్ద జై బాలయ్య అనే నినాదం మారుమ్రోగనుంది. బాలయ్య తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో బాలయ్యను మునుపెన్నుడూ చూడని అవతార్ లో కనిపిస్తారని ఇప్పటికే మేకర్స్ చెప్పుకువచ్చారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఆయన కూతురిగా నటిస్తుంది. ఇక బాలయ్యను ఢీ కొట్టేందుకు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు వచ్చాయి. ఇవి మ్యూజిక్ పరంగా ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే భగవంత్ కేసరి ట్రైలర్, పాటలు నెట్టింట షేక్ చేస్తున్నాయి. ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ అయితే కేక పుట్టిస్తున్నాయి. తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే.. ఫ్యాన్స్ కే కాదు.. మామూలు ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ వస్తున్నాయి. కూతురి ముందు తండ్రి నిలబడితే.. వంద దేవుళ్ల లెక్క అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక గణేశ్ అంథేమ్, ఉయ్యాలా పాట ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ సాంగ్ వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. మోస్ట్ అవైటెడ్ సాంగ్ అయిన రోర్ ఆఫ్ భగవంత్ కేసరిని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పాటను తమన్ అండ్ కోరస్ టీమ్ అద్భుతంగా ఆలపించగా.... కాసర్ల శ్యాం సాహిత్యం అందించాడు. ఇక పవర్ఫుల్ బీట్స్ తో తమన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేశాడు. మొత్తంగా ఈ రోర్ ఆఫ్ కేసరి సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ అందుకుంటోంది.
ఇక బాలయ్య గర్జిస్తే ఎలా ఉంటుందో.. ఈ పాట వింటే అర్థం అవుతుంది. ఈ సాంగ్ దశాబ్ధాల పాటు.. గుర్తిండిపోయేలా తమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. భగవంత్ కేసరి అక్టోబర్ 19న గ్రాండ్ గా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.


Click it and Unblock the Notifications











