Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్‌కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Akhanda తమన్ కోసం ఇంటర్‌పోల్ వేట.. బద్దలు కొట్టాడంటూ బాలకృష్ణ వైరల్ కామెంట్స్
టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య చోటు చేసుకొన్న ప్రతిష్టంభన నడుమ విడుదలైన అఖండ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. అభిమానులు, సినిమా పరిశ్రమ వర్గాల అంచనాలను తలదన్నేలా రికార్డు వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. దీంతో అఖండ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో మాట్లాడుతూ..

తమన్ ప్రత్యేక ఆకర్షణగా
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం వారిద్దరికి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ విజయం వెనుక అనేక బలాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ, పాటలు గానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. మాస్ ప్రేక్షకులకు థ్రిల్‌ను అందించి.. ఈలలు వేసే విధంగా చేసింది.

సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి
అఖండ విషయంలో తమన్ మ్యూజిక్ ఓ మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అఖండ చిత్రం ప్రదర్శించిన పలు థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి. కొన్ని థియేటర్లలో మ్యూజిక్ బాక్స్‌ల నుంచి పొగలు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతటి హై ఓల్టేజ్ మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా మారింది. తమన్ మ్యూజిక్‌ను సగటు ప్రేక్షకులతోపాటు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.

మ్యూజిక్ మిక్సింగ్ సమయంలోనే
అఖండ థ్యాంక్స్ మీట్‌లో తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా మ్యూజిక్ మిక్సింగ్ సమయంలోనే బాక్సులు బద్దలయ్యాయి. పలు చోట్ల సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి. ఇలాంటి పని చేసిన తమన్ గురించి వెతుకుతున్నారు. అందుకే ఇక్కడికి రాకుండా తమన్ తప్పించుకొని తిరుగుతున్నారు అంటూ చమత్కరించారు.

ఆఖండకు ఆణిముత్యాల్లాంటి పాటలు
అఖండ సినిమాకు సంబంధించి తమన్ ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. ఆయన అందించిన స్వరబాణిలకు అద్భుతంగా సాహిత్యం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. అందుకు తమన్ టీమ్‌కు నా ధన్యవాదాలు అని బాలకృష్ణ తెలిపారు.

కరోనా బారిన పడిన ఎస్ఎస్ తమన్
ఇదిలా ఉండగా, ఇటీవల తమన్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ మధ్య దుబాయ్‌కు వెళ్లొచ్చిన తమన్ స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ప్రస్తుతం స్వీయ గృహనిర్బంధాన్ని పాటిస్తూ చికిత్స పొందుతున్నారు. అందుకే అఖండ థ్యాంక్యూ మీట్‌కు హాజరుకాలేదని యూనిట్ సభ్యులు వెల్లడించారు.