Veera Simha Reddy: జై బాలయ్య సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. మాస్ లుక్ లో స్పెషల్ పోస్టర్ వైరల్
అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి రాబోతున్న మరో మాస్ యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ విజయాన్ని సొంతం చేసుకున్న మాస్ కమర్షియల్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ను కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు.
ఇక ఈసారి కూడా జై బాలయ్య అనే పాటతోనే ఫ్యాన్స్ కు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 25వ తేదీన ఉదయం 10గంటల 29 నిమిషాలకు విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు అంటూ బాలకృష్ణ కళ్లద్దాలు పెట్టుకొని వైట్ డ్రెస్ లో కనిపిస్తున్నారు.

అంతేకాకుండా ఆయన మహీంద్రా ట్రాక్టర్ పై కూర్చుని నవ్వుతున్న విధానం కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. ఈసారి నందమూరి మాస్ ఆడియన్స్ కు బాలయ్య సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటికే అఖండ సినిమాలో జై బాలయ్య అనే ట్యాగ్ తో వచ్చిన సాంగ్ ఒక రేంజ్ లో హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంతకుమించి అనేలా థమన్ బీట్ సాంగ్ ఇవ్వబోతున్నాడు.
తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దునియా విజయ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. మరి భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











