ఏమో ఏమో ఏ గుండెల్లో.. ఆలోచింపజేసేలా ఎంత మంచివాడవురా ఫస్ట్ సింగిల్

పటాస్ చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ తన సత్తాను చాటుకున్న హీరో.. మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ కొట్టలేకపోతున్నాడు. కొత్త ట్రై చేసిన నా నువ్వే, 118 కూడా విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయాయి. తాజాగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంత మంచివాడవురా' అంటూ పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది.

ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా మొదటి పాట 'ఏమో ఏమో ఏ గుండెల్లో'ను ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. పరోపకారం, బంధాలు, బంధుత్వాలు అంటూ మంచి మాటలను చెప్పుకుంటూ సాగినా.. ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించగా.. అందుకే పాటపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు.

Nandamuri Kalyan Ram Entha Manchivadavura First Single Released

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X